ఉక్రెయిన్‌లో వంద‌లాది మంది ప్ర‌జ‌లు ప్రాణాలు కోల్పోయిన‌ట్లు ప‌లు మీడియా సంస్థ‌లు వెల్లడి…!!.సుమారు 350 మంది తెలుగు విద్యార్థులు ఉక్రెయిన్ లొ…..

క్రిమియా నుంచి ప్రవేశించిన దళాలురష్యా సైన్యం..

ఉక్రెయిన్‌లో వంద‌లాది మంది ప్ర‌జ‌లు ప్రాణాలు కోల్పోయిన‌ట్లు ప‌లు మీడియా సంస్థ‌లు చెబుతున్నాయి. ఈ నేప‌థ్యంలో ఉక్రెయిన్ మ‌ర‌ణాల సంఖ్య‌పై అధికారికంగా ఓ ప్ర‌క‌ట‌న చేసింది…ర‌ష్యా దాడుల్లో ఇప్ప‌టివ‌ర‌కు ఏడుగురు మృతి చెందార‌ని, తొమ్మిది మందికి తీవ్ర‌గాయాల‌య్యాయని తెలిపింది. కాగా, ఉక్రెయిన్లోని కీల‌క ప్రాంతాల్లో సైనిక స్థావ‌రాల‌పై ర‌ష్యా జ‌రుపుతోన్న దాడుల్లో అమాయ‌క ప్ర‌జ‌లూ బ‌ల‌వుతున్నట్లు తెలుస్తోంది. యుద్ధాన్ని ఆపాల‌ని ప‌లు దేశాలు కోరుతున్నాయి. రేపు జీ7 దేశాల స‌మావేశం ఏర్పాటు చేయ‌నున్నారు. .
క్రిమియా నుంచి ప్రవేశించిన రష్యా సైన్యం అన్ని వైపుల నుంచి ఉక్రెయిన్​పైకి దండెత్తుతోంది. ఇప్పటికే బెలారస్ నుంచి రష్యా బలగాలు ఉక్రెయిన్​లోకి ప్రవేశించగా.. తాజాగా క్రిమియా నుంచి దాడి చేశాయి. రష్యా సైనిక వాహనాలు ఉక్రెయిన్​లోకి ప్రవేశించడం సెక్యూరిటీ కెమెరాల్లో నిక్షిప్తమైంది.

ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయు విద్యార్థులు కుటుంబ సభ్యుల ఆందోళన..
ఉక్రెయిన్ నుంచి భారతీయుల్ని వెనక్కి రప్పించే ప్రక్రియకు విఘాతం ఏర్పడింది. ఉక్రెయిన్ ఎయిర్‌స్పేస్‌పై బ్యాన్ విధించడంతో ఇండియా విమానం వెనుదిరగడం ఆందోళన కల్గిస్తోంది. ..
ఉక్రెయిన్‌లో మన భారతీయులు ఎంతో మంది చిక్కుకున్నారు. వారిలో 350 మంది తెలుగు విద్యార్థులు ఉన్నట్లు తెలుస్తోంది. వీళ్లంతా ఉన్నత చదువుల కోసం ఉక్రెయిన్ వెళ్లి అక్కడ చిక్కుకుపోయినట్లు సమాచారం అందుతోంది.
దీంతో ఇటీవల భారతీయులను తీసుకొచ్చేందుకు ఎయిరిండియా విమానం వెళ్లగా.. ఉక్రెయిన్ ఎయిర్‌స్పేస్ మూసేయడంతో విమానం ఖాళీగా తిరిగొచ్చేసింది. దీంతో తమ వాళ్ల సమాచారం తెలియకపోవడంతో ఢిల్లీలోని ఉక్రెయిన్ ఎంబసీ దగ్గర విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన పడుతున్నారు. తమ పిల్లలను ఎలాగైనా స్వదేశానికి ర‌ప్పించాల‌ని వారు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖను కోరుతున్నారు…మరోవైపు ఉక్రెయిన్‌లోని భారత ఎంబసీ అధికారులను సంప్రదించి విద్యార్థులను సురక్షితంగా స్వదేశానికి తరలించాలని తాము కూడా కోరినట్లు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రక‌ట‌న చేసింది. దీంతో సంబంధిత అధికారులు ఉక్రెయిన్‌లోని తెలుగు విద్యార్థుల చిరునామాల‌ను సేక‌రిస్తున్నారు. కొద్ది సేప‌టి క్రితం తెలంగాణ ఎన్నారై సెల్ అధికారులకు వారు ఫోన్ చేసి సమాచారాన్ని కోరారు. ఏపీ, తెలంగాణకు చెందిన సుమారు 350 మంది తెలుగు విద్యార్థులు ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయారని విదేశీ వ్యవ‌హారాల శాఖ కూడా వెల్లడించింది…