రష్యా-ఉక్రెయిన్‌ మధ్య నెలకొన్న భీకర దాడుల నేపథ్యంలో రెండోరోజు కీలక పరిణామాలు…

భారత దేశంలోని రష్యా ఎంబసీ కుడా ప్రకటన విడుదల చేసింది……

ఉక్రెయిన్ అధికారుల బృందంతో చర్చలకు సిద్ధమని పుతిన్ ప్రకటించారు. బెలారస్ రాజధాని మిన్స్క్ కు ప్రతినిధుల బృందాన్ని పంపిస్తామని భారత దేశంలోని రష్యా ఎంబసీ ప్రకటించింది.
రష్యా-ఉక్రెయిన్‌ మధ్య నెలకొన్న భీకర దాడుల నేపథ్యంలో రెండోరోజు కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఉక్రెయిన్‌ సైన్యం ఆయుధాలు వీడితే చర్చలకు సిద్ధమేనంటూ రష్యా చేసిన ప్రకటనపై ఉక్రెయిన్‌ కూడా స్పందించింది. నాటో కూటమిలో చేరకుండా తటస్థంగా ఉండే విషయంలో రష్యాతో చర్చలకు సిద్ధమేనని ఉక్రెయిన్‌ తెలిపింది…...మరోవైపు అధ్యక్షుడిని కాపాడుకునేందుకు ఉక్రెయిన్ సైన్యం అలెర్ట్ అయ్యింది. జెలెన్ స్కీ ని బంకర్లోకి తరలించినట్లు తెలుస్తోంది. రష్యాపై పోరాటంలో ప్రపంచ దేశాలు ప్రేక్షకపాత్ర వహిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు ఉక్రెయిన్ అధ్యక్షుడు..యుద్ధ అనుభవం ఉన్న వాళ్లు ఉక్రెయిన్ కు సహకరించాలని యూరోపియన్లను కోరారు.18 వేల మందికి ఆయుధాలు ఇచ్చినట్లు ప్రకటించారు.
దేశ భవిష్యత్ ప్రతి ఒక్క పౌరుడి చేతిలో ఉందని అన్నారు.