స్వల్పంగా తగ్గిన ఉల్లి ధర..!

రోజురోజుకూ ఎగబాకి చుక్కలను తాకి స్వల్పంగా తగ్గిన ఉల్లి ధర.. ఉల్లి ధరలు క్రమంగా కొంత తగ్గుముఖం పట్టాయి. ధర్మవరం కూరగాయల మార్కెట్లో శుక్రవారం ఉల్లి ధర కొద్దిగా తగ్గి ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. మొదటి రకం ఉల్లిధర కిలో రూ. 80 ఉండగా రెండవ రకం ఉల్లిధర కిలో రూ.40గా విక్రయిస్తున్నారు. వారం రోజుల క్రితం మొదటి రకం ఉల్లిధర కిలో రూ. 100 ఉండగా రెండవ రకం రూ. 70గా ఉండేది. పూణే నుంచి ఉల్లి ఎగుమతులు ఆశించిన స్థాయిలో రావడంతో ధర తగ్గుముఖం పడుతున్నట్లు మార్కెట్ వర్గాలు తెలిపాయి…