భారీగా తరలి వస్తున్న ఉల్లి…

భారీగా తరలి వస్తున్న ఉల్లి…

తెలంగాణకు ఉల్లి సరఫరా వెల్లువెత్తుతోంది. రాష్ట్రంలో పండిన ఉల్లితో పాటు మహారాష్ట్ర నుంచి కూడా భారీగా ఉల్లిగడ్డ సరఫరా అవుతోంది.హైదరాబాద్‌నగరంలోని ప్రధాన హోల్‌సేల్‌ మార్కెట్‌లకు ఉల్లిసరఫరా భారీగా పెరగడంతో ధరలు బాగా పడిపోయాయి. దీంతో గతసంవత్సరం ఇదే నెలలో పలికిన ధరలు ఇప్పుడు పలుకుతున్నాయి. ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా ఉల్లి ధరలు 100 రూపాయలు నాలుగు కిలోల వరకూ అమ్ముతున్నారు. నగరంలోని ప్రధాన హోల్‌సేల్‌ మార్కెట్‌లయిన మలక్‌పేట, బేగంబజార్‌తో పాటు బోయిన్‌పల్లి మార్కెట్‌లకు రోజుకు 150 నుంచి 180 లారీల ఉల్లిగడ్డ సరఫరా అవుతోంది.
హోల్‌సేల్‌ మార్కెట్‌లో క్వింటాల్‌ ఉల్లి గడ్డ 500 నుంచి 750 రూపాయల వరకు పలుకుతున్నాయి. దీంతో రిటైల్‌ మార్కెట్‌లు, రైతుబ జార్లలో ధరలు బాగా పడిపోయాయి. ముఖ్యంగా గత సంవత్సరంకంటే ఈసారి మహారాష్ట్రలో కూడా ఉల్లి ఉత్పత్తి భారీగా పెరిగిందని వ్యాపారులు తెలిపారు. అలాగే తెలంగాణలోని మహబూబ్‌నగర్‌, మెదక్‌, రంగారెడ్డితదితర జిల్లాల్లోనూ గత సంవత్సరం కంటే ఎక్కువగానే ఉత్పత్తి పెరిగినట్టు వ్యాపారులు తెలిపారు. దీంతో ధరలు బాగా పడిపోయాయని వ్యాపారులు తెలిపారు.