అండర్ 19 వరల్డ్ కప్…. సౌతాఫ్రికా పై భారత్ విజయం..

సౌతాఫ్రికా అండర్ 19 టీమ్ తో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్ లో ఇండియా అండర్ 19 రెండు వికెట్లతో విజయం సాధించి ఫైనల్ చేరింది…
245 పరుగుల టార్గెట్ చేజింగ్ లో 32 పరుగులకే 4 వికెట్లు కోల్పోయినా సచిన్ దాస్ (96), కెప్టెన్ ఉదయ్ సహరన్ (81) హాఫ్ సెంచరీలతో యంగిండియా 9వసారి అండర్ 19 వరల్డ్ కప్ ఫైనల్ చేరింది. ఆస్ట్రేలియా అండర్ 19, పాకిస్థాన్ అండర్ 19 టీమ్స్ మధ్య గురువారం (ఫిబ్రవరి 8) జరగబోయే రెండో సెమీఫైనల్ విజేతతో ఇండియా ఫైనల్లో తలపడుతుంది…అండర్ 19 హీరోలు సచిన్, ఉదయ్

అండర్ 19 వరల్డ్ కప్ తొలి సెమీఫైనల్లో ఆతిథ్య సౌతాఫ్రికా జట్టుతో ఇండియా బెనోనీలో తలపడింది. ఈ మ్యాచ్ లో సౌతాఫ్రికా అండర్ 19 విసిరిన 245 పరుగుల లక్ష్య ఛేదనలో 32 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. సౌతాఫ్రికా పేసర్లు మఫాకా, ట్రిస్టన్ లూస్ చెలరేగారు. దీంతో ఆదర్ష్ సింగ్ (0), అర్షిన్ కులకర్ణి (12), ముషీర్ ఖాన్ (4), ప్రియాన్షు మోలియా (5) వికెట్లను త్వరత్వరగా కోల్పోయింది.

ఈ సమయంలో ఇండియా అండర్ 19 ఇక గెలవడం అసాధ్యమనే అనుకున్నారంతా. కానీ ఈ టోర్నీ మొత్తం నిలకడగా రాణిస్తున్న సచిన్ దాస్, కెప్టెన్ ఉదయ్ సహరన్ అద్భుతమైన పోరాటం చేశారు. ఓవైపు సచిన్ దాస్ వచ్చీరాగానే బౌండరీలతో సఫారీ బౌలర్లపై ఒత్తిడి పెంచగా.. మరోవైపు టోర్నీ టాప్ స్కోరర్ ఉదయ్ ఆచితూచి ఆడుతూ వికెట్ పడకుండా కాపాడాడు…