అండర్‌ వాటర్‌ మెట్రో రైలులో విద్యార్థులతో కలిసి మోదీ ప్రయాణం..

ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం పశ్చిమ బెంగాల్ రాష్ట్రం కోల్‌కతాలో పర్యటించారు. దేశంలోనే తొలి అండర్ వాటర్ మెట్రో రైలును ప్రారంభించారు.అనంతరం విద్యార్థులతో కలిసి ప్రధాని మోదీ రైలులో ప్రయాణించారు. విద్యార్థులతో పలు అంశాలపై సరదాగా చర్చిస్తూ మోదీ రైలులో ప్రయాణించారు. ప్రధానితో పాటు మెట్రో సిబ్బంది, బీజేపీ చీఫ్ సుకాంత్ మజుందార్, బీజేపీ ఎమ్మెల్యే సువేందు అధికారికూడా ఉన్నారు. ఎస్ ప్లనేడ్ నుంచి హావ్ డా మైదాన్ స్టేషన్ వరకు మోదీ ప్రయాణించారు. ఈ సందర్భంగా మెట్రో సిబ్బంది ప్రధాని మోదీకి నదీగర్భం రైలు ప్రయాణ విశేషాలను వివరించారు. ఇదిలాఉంటే మోదీ నదీగర్భం గుండా ప్రయాణించే మెట్రో రైలులో విద్యార్థులతో కలిసి ప్రయాణించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి..