ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం త‌మ బ‌డ్జెట్‌లో అయోధ్యలో నిర్మిస్తున్న‌ ఎయిర్‌పోర్ట్‌ కోసం రూ.101 కోట్లు కేటాయించింది….

ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం త‌మ బ‌డ్జెట్‌లో అయోధ్యలో నిర్మిస్తున్న‌ ఎయిర్‌పోర్ట్‌ కోసం రూ.101 కోట్లు కేటాయించింది. అలాగే అటు నోయిడా ఇంట‌ర్నేష‌న‌ల్ ఎయిర్‌పోర్ట్‌కు రూ.2000 కోట్ల కేటాయించారు. అయోధ్య‌లో నిర్మాణంలో ఉన్న ఎయిర్‌పోర్ట్‌కు మ‌ర్యాద పురుషోత్తం శ్రీరామ్ అనే పేరు పెట్టిన‌ట్లు ఆర్థిక మంత్రి సురేశ్ ఖ‌న్నా వెల్ల‌డించారు. అటు నోయిడా ఎయిర్‌పోర్ట్‌ను ప్ర‌పంచంలోనే అత్యుత్త‌మ ఎయిర్‌పోర్ట్‌ల‌లో ఒక‌టిగా నిర్మించ‌నున్న‌ట్లు సీఎం యోగి ఆదిత్యనాథ్ చెప్పారు. ఏడాదికి కోటి 20 ల‌క్ష‌ల మంది ప్ర‌యాణికులు ఈ ఎయిర్‌పోర్ట్ ద్వారా రాక‌పోక‌లు సాగించేలా నిర్మిస్తున్న‌ట్లు తెలిపారు. జేవ‌ర్‌లో ఈ ఎయిర్‌పోర్ట్‌ను నిర్మిస్తున్నారు.