ఉత్తరప్రదేశ్‌ రాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీ ప్రతిజ్ఞా యాత్ర పేరుతో ప్రియాంక గాంధీ..

వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్న అత్యంత కీలకమైన ఉత్తరప్రదేశ్‌లో అధికార పీఠాన్ని దక్కించుకొనేందుకు, బలమైన శక్తిగా ఎదిగేందుకు ప్లాన్‌ చేస్తోంది కాంగ్రెస్‌ పార్టీ.. కొత్త వ్యూహాలతో ప్రజల ముందుకు వెళ్తోంది.. అందులో భాగంగానే ఉత్తరప్రదేశ్‌ రాష్ట్ర వ్యవహారాల బాధ్యతలను పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రాకు అప్పగించింది కాంగ్రెస్‌ పార్టీ.. ఆ తర్వాతే కాంగ్రెస్‌ కొత్త జోష్‌ వచ్చిందనేని పార్టీ శ్రేణులు, విశ్లేషకులు చెబుతున్న మాట.. ఇక, వచ్చే ఏడాది జరగబోయే ఎన్నికల్లో గెలుపే టార్గెట్‌గా పెట్టుకున్న కాంగ్రెస్ పార్టీ.. రాష్ట్రంలోని మూడు ప్రాంతాల్లో ప్రతిజ్ఞా యాత్రల పేరు క్షేత్రస్థాయిలోకి వెళ్లేందుకు సిద్ధమైంది….దేశంలో రాజకీయంగా అత్యంత కీలకమైన ఉత్తరప్రదేశ్‌లో అధికార పీఠాన్ని దక్కించుకొనేందుకు, బలమైన శక్తిగా ఎదిగేందుకు కాంగ్రెస్‌ పార్టీ కొత్త వ్యూహాలకు పదునుపెడుతోంది. పార్టీ ఉత్తరప్రదేశ్‌ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జిగా జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా బాధ్యతలు చేపట్టిన తర్వాత కాంగ్రెస్‌ నేతల్లో కొత్త జోష్‌ కనిపిస్తోంది. వచ్చే ఏడాది ఆరంభంలో జరగబోయే శాసనసభ ఎన్నికలే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు. అందులో భాగంగా ఉత్తరప్రదేశ్‌లోని మూడు ప్రాంతాల్లో కాంగ్రెస్‌ పార్టీ ప్రతిజ్ఞా యాత్రల పేరుతో శనివారం నుంచి ప్రజల్లోకి వెళ్లనుంది…