పెండ్లిలో సడన్‌గా పెండ్లి కొడుకు చెంప చెల్లుమనిపించిన పెండ్లి కూతురు..

ఉత్తరప్రదేశ్‌లోని ఓ పెండ్లిలో సడన్‌గా పెండ్లి కొడుకును చెంప దెబ్బ కొట్టి పెండ్లి కూతురు వివాహ వేదికపై నుంచి దిగి వెళ్లిపోయింది.
https://twitter.com/fpjindia/status/1516304578421006336?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1516304578421006336%7Ctwgr%5E%7Ctwcon%5Es1_c10&ref_url=https%3A%2F%2Ftnewstelugu.com%2Fup-bride-slaps-groom-during-varmala-ceremony-walks-off-the-stage-viral-video
సరిగ్గా వరమాల మెడలో వేసే సమయంలో పెళ్లి కుమార్తె ఇలా వెళ్లిపోవడంతో దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.యూపీలోని జలౌన్ జిల్లా చమరి గ్రామానికి చెందిన రవికాంత్ అనే యువకుడికి, హమిర్‌‌పూర్‌‌ జిల్లా బుడ్జ్‌ గ్రామ యువతి రీనాతో పెళ్లి ఫిక్స్ అయింది. ఈ ఏప్రిల్‌ 17 రాత్రి పెండ్లి ముహుర్తం. ఆ యువతిని పెళ్లాడేందుకు వరుడు బరాత్ చేసుకుంటూ సంబురంగా ఆమ్మాయి స్వస్థలానికి చేరుకున్నాడు. వివాహ వేదికపై పెండ్లి కూతురి మెడలో వరమాల వేసే ముందు వరకు అంతా బాగానే ఉంది. అతడు వరమాల వేయగానే ఒక్కసారిగా పెండ్లి కూతురు కోపంతో ఊగిపోయింది. పెండ్లి కుమారుడిని రెండు మూడు సార్లు చెంప దెబ్బ కొట్టి.. స్టేజి దిగి వెళ్లిపోయింది. దీనికి సంబంధించిన వీడియో ఆ పెండ్లి వేడుకలో ఉన్న వాళ్లు సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అది తెగ వైరల్ అవుతోంది. అయితే పెండ్లి కూతురు అలా చెంప దెబ్బ కొట్టడానికి కారణమేంటన్నది ఆమె వెల్లడించలేదు. అయితే పెండ్లి కుమారుడు తాగి రావడం వల్లే ఆమె అలా చేసిందని పెండ్లి కుమార్తె బంధువులు చెప్పినట్లు ఓ జాతీయ మీడియా చానెల్ పేర్కొంది.పెండ్లి కూతురు అలా వివాహ వేదికపై కాబోయే భర్తను చెంప దెబ్బ కొట్టి వెళ్లిపోవడం.. వధూవరుల కుటుంబాల మధ్య పెద్ద గొడవకు దారితీసింది. అయితే చివరికి రెండు కుటుంబాలు మాట్లాడుకుని పెండ్లి జరిపించినట్లు తెలుస్తోంది….