ఉత్తరప్రదేశ్‌లో దారుణ ఘటన.కొడుకు బట్టలు విప్పేసి కాళ్లు, చేతులు కట్టేసి రైలు పట్టాలపై కూర్చోబెట్టిన తండ్రి..!!.

ఉత్తరప్రదేశ్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ తండ్రి కొడుకును శిక్షించాలని తీవ్ర నిర్ణయం తీసుకున్నాడు. కొడుకు బట్టలు విప్పేసి కాళ్లు, చేతులు కట్టేసి రైలు పట్టాలపై కూర్చోబెట్టాడు. ఇందుకు సంబంధించిన వీడియో బయటకు వచ్చింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని హర్దోల్‌లో చోటుచేసుకుంది.

హర్దోల్‌లో ఓ వ్యక్తి తన పదేళ్ల కొడుకును శిక్షించాలని నగ్నంగా రైలు పట్టాలపై కూర్చోబెట్టాడు. తెల్లని ప్లాస్టిక్ వైర్లతో కాళ్లు, చేతులు కట్టేసి కూర్చోబెట్టాడు. ఆ పిల్లాడు ఏడుస్తూ ఉన్నాడు. ఇంతలో అక్కడ కొంత మంది గుమిగూడారు. ఇదేం పని అంటూ వారు ఆయనను ప్రశ్నించారు..
వెంటనే కట్లు విప్పేసి బాలుడిని రైలు పట్టాలపై నుంచి ఇంటికి తీసుకెళ్లాలని ఓ మహిళ గట్టిగా చెప్పుతున్నట్టు ఆ వీడియోలో కనిపించింది. పట్టాలపై కూర్చోబెట్టాల్సిన అవసరం ఏమిటంటూ ఆమె ప్రశ్నించింది. ఇంకొందరు అక్కడి నుంచి రైలు వస్తున్నట్టు కనిపిస్తున్నదని చెప్పారు. దీంతో ఆ బాలుడిని తండ్రి అక్కడి నుంచి తీసుకుని సమీపంలోని మరో చోట కూర్చోబెట్టాడు..అయితే, ఆ వ్యక్తిని ఇంకా గుర్తించాల్సి ఉన్నది. ఈ వీడియో పోలీసుల వరకూ చేరింది. దీంతో పోలీసులు రియాక్ట్ అయ్యారు. ఈ ఘటనకు సంబంధించిన మరింత సమాచారం సేకరించే పనిలో పడ్డారు. ఆ వీడియోలోని వ్యక్తిని గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ఘటన పై స్థానికులు కూడా తీవ్రంగా స్పందించారు..