ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పుట్టినరోజు వేడుకలు..ప్రపంచంలోనే అతి ఎత్తైన కేక్​ను కట్ చేసి రికార్డు..!!!

జూన్ 5 న యోగి ఆదిత్యనాథ్ పుట్టినరోజు అన్న సంగతి అందరికీ తెలిసినదే.ఈ సందర్భంగా బరేలీ జిల్లాలో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పుట్టినరోజు వేడుకలను అభిమానులు పతాకస్థాయిలో జరిపారు.ఈ సందర్భంగా స్థానిక భాజపా కార్యకర్త అమీర్ జైదీ 111.6 అడుగుల ఎత్తైన కేక్‌ను తయారు చేయించి ఆహుతులను ఆశ్చర్యపరిచారు. ప్రపంచంలోనే అతి ఎత్తైన కేక్​ను కట్ చేసి రికార్డు సృష్టించాలన్న లక్ష్యంతో ఇలా చేసినట్లు ఆయన మీడియా వేదికగా తెలిపారు…ఆదివారం నాటికీ 51వ పడిలోకి అడుగుపెట్టారు…ఆయన పుట్టినరోజు సందర్భంగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో అభిమానులు వివిధ రూపాల్లో ఘనంగా వేడుకలను జరుపుకోవడం విశేషం. ఆదివారం సాయంత్రం జరిగిన ఈ కార్యక్రమానికి భారీగా అభిమానులు వచ్చారు..రాష్ట్రవ్యాప్తంగా శాంతిభద్రతలు నెలకొల్పేందుకు ముఖ్యమంత్రి చేసిన కృషికి గాను ఈ కేక్‌ను పీస్‌ ఆఫ్‌ కేక్​గా అమీర్​ జైదీ అభివర్ణించారు….. చేసినట్టు సమాచారం.దీనికి గాను 35 క్వింటాళ్ల మైదాను వాడినట్టు తెలుస్తోంది.మిగిలిన ఇంగ్రిడియన్స్ తో కలిపి మొత్తగా 40 క్వింటాళ్లు అయిందని భోగట్టా..
ఎత్తైన కేకుని 40 మంది సిబ్బంది తయారు..ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన కేక్‌ను తయారు చేయించి రికార్డు సృష్టించినట్లు ఈ సందర్భంగా అమీర్ చెప్పుకొచ్చారు.మరోవైపు అయోధ్యలో 5 లక్షల మంది యోగి అభిమానులు సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం చేయడం కొసమెరుపు…ఇంతవరకూ ఇంత పెద్దమొత్తంలో వున్న కేకుని ప్రపంచంలో మరెవరూ కట్ చేయలేదని తెలుస్తోంది.