ఉప్పల ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిరుపేద కుటుంబానికి చెందిన అమ్మాయి పెళ్లికి పుస్తె, మెట్టెలు ,చీర, గాజులు విరాళం..

ఉప్పల ఫౌండేషన్ ఆధ్వర్యంలో.. ST-(లంబాడ) నిరుపేద కుటుంబానికి చెందిన, తండ్రి లేని, అమ్మాయి పెళ్లికి పుస్తె, మెట్టెలు ,చీర, గాజులు విరాళం..

సూర్యాపేట జిల్లా,

కోదాడకి చెందిన (ప్రస్తుతానికి నాగోల్ జైపురి కాలనీ లో నివాసం ఉంటున్న) మంగి నాయక్ (లేటు) -సూరాబాయ్ కూతురు..మణిరత్నం వివాహం కోసం ఈరోజు హైదరాబాద్ లోని నాగోల్ లో ఉప్పల శ్రీనివాస్ గుప్త నివాసంలో కలసిన సందర్భంగా.. ఉప్పల ఫౌండేషన్ ఆధ్వర్యంలో.. తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ మరియు ఉప్పల ఫౌండేషన్ చైర్మన్ శ్రీ ఉప్పల శ్రీనివాస్ గుప్త వారి సతీమణి ఉప్పల ఫౌండేషన్ కో-చైర్ పర్సన్ ఉప్పల స్వప్న చేతుల మీదుగా మంగళ సూత్రం, మెట్టెలు,చీర,గాజులు విరాళంగా ఇవ్వడం జరిగింది…ఈ కార్యక్రమంలో.. పెళ్లికూతురు మణిరత్నం మరియు తల్లి సూరాబాయ్ మరియు IVF రాష్ట్ర మహిళా విభాగం సభ్యులు, జైపురి కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు..