యూపీపఎస్సీ సివిల్స్ 2022 ఫలితాల్లో మహిళలు చరిత్ర సృష్టించారు. ..తొలి నాలుగు ర్యాంకులు మహిళలే….

UPSC CSE 2022 Results

యూపీపఎస్సీ సివిల్స్ 2022 ఫలితాల్లో మహిళలు చరిత్ర సృష్టించారు. తొలి నాలుగు ర్యాంకులు మహిళలే సాధించడం ఈ యూపీపఎస్సీ సివిల్స్ 2022 ప్రత్యేకత. తొలి ర్యాంక్ ను ఇషిత కిషోర్ సాధించగా, రెండో ర్యాంక్ ను గరిమా లోహియా, మూడో ర్యాంక్ ను ఉమా హారతి, నాలుగో ర్యాంక్ ను స్మృతి మిశ్రా సాధించారు.సివిల్స్ 2022 లో మొత్తం 933 మంది ఐఏఎస్, ఐపీఎస్ వంటి అత్యున్నత పోస్ట్ లకు ఎంపిక అయినట్లు యూపీఎస్సీ ప్రకటించింది. ఈ 933 మందిలో జనరల్ కేటగిరీలో 345 మంది, ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో 99 మంది, ఓబీసీ కేటగిరీలో 263 మంది, ఎస్సీ కేటగిరీలో 154, ఎస్టీ కేటగిరిలో 72 మంది ఎంపికయ్యారు. అలాగే, ఈ సవిల్ సర్వీసెస్ పరీక్ష ద్వారా 180 మందిని ఐఏఎస్ కు, 200 మందిని ఐపీఎస్ కు, 38 మందిని ఐఎఫ్ఎస్ కు, 473 మందిని గ్రూప్ ఏ కేంద్ర సర్వీసులకు, 131 మందిని గ్రూప్ బీ సర్వీసులకు ఎంపిక చేశారు.

కాకతీయ యూనివర్సిటీ అర్థశాస్త్ర ఆచార్యులు మంద అశోక్ కుమార్ కూతురు మంద అపూర్వ సివిల్స్ ఫలితాలలో 646వ‌ ర్యాంకు సాధించారు. మంద అపూర్వ ఉస్మానియా యూనివర్సిటీలో బీటెక్ పూర్తి చేసి ప్రస్తుతం ఎంటెక్ చేస్తున్నారు. హనుమకొండ ఎక్సైజ్ కాలనీలో నివసిస్తున్న అపూర్వ తల్లి మంద రజనీ దేవి ప్రభుత్వ టీచర్ గా భీమదేవరపల్లి మండలం మాణిక్య పూర్ లో పనిచేస్తున్నారు.
మందా అపూర్వకు ఇద్దరు అన్నయ్యలు ఉన్నారు పెద్దన్నయ్య అరుణ్ అమెరికాలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా చిన్న అన్నయ్య అభినవ్.. పుణెలోని ఓ ఫార్మసీ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు. మంద అపూర్వకు శాతవాహన యూనివర్సిటీ మాజీ ఉపకులపతి ఆచార్య మహమ్మద్ ఇక్బాల్ అలీ కేయూ అధ్యాపకులు ఆచార్య కూరపాటి వెంకటనారాయణ, డాక్టర్‌ ఎర్రబొజ్జు రమేష్ త‌దిత‌రులు అభినందనలు తెలియజేశారు.
ఈ సంద‌ర్భంగా మంద అపూర్వ మాట్లాడుతూ.. `నా త‌ల్లిదండ్రుల వ‌ల్లే విజ‌యం సాధించా. ప్ర‌త్యేకించి నా త‌ల్లి నిత్యం నాకు మ‌ద్ద‌తుగా ఉండేవారు. స్ఫూర్తినిచ్చారు. నేను సివిల్స్‌లో విజ‌యం సాధిస్తాన‌ని న‌మ్మారు. నా ప్ర‌యాణంలో న‌న్ను వెన్ను త‌ట్టి ప్రోత్స‌హించిన నా సోద‌రుల‌కు, మిత్రుల‌కు ధ‌న్య‌వాదాలు` అని పేర్కొన్నారు…

సూర్యాపేట జిల్లా..
హుజూర్ నగర్ కు చెందినా ఉమా హారతి…

సివిల్ సర్వీస్ ఫలితాలలో సత్తా చాటిన నారాయణపేట SP వెంకటేశ్వర్లు కూతురు*

*జాతీయ స్థాయిలో మూడవ ర్యాంకు సాధించిన ఉమా హారతి..

యూపీఎస్సీ సివిల్‌ సర్వీసెస్‌ (UPSC CSE 2022 Results) ఫలితాల్లో తెలుగు రాష్ట్రాల విద్యార్థులు సత్తా చాటారు.

తెలంగాణకు చెందిన యువతి *నూకల ఉమా హారతి మూడో ర్యాంకుతో* మెరిశారు. ఆమె నారాయణపేట జిల్లా ఎస్పీ వెంకటేశ్వర్లు కుమార్తె కావడం విశేషం. ఉమా హారతి సాధించిన విజయానికి ప్రశంసల జల్లు కురుస్తోంది. కుటుంబ సభ్యులు, స్నేహితులు ఆనందంలో మునిగితేలారు.

ఈ సందర్భంగా ఉమా హారతి మీడియాతో మాట్లాడారు. తాను సివిల్స్‌లో విజేతగా నిలవడానికి గల కారణాలను పంచుకున్నారు.

‘‘ఏదో ఒక ర్యాంకు వస్తే చాలనుకున్నాను. మూడో ర్యాంకు వస్తుందని మాత్రం అస్సలు ఊహించలేదు. రోజూ ఏడెనిమిది గంటల పాటు చదివేదాన్ని. ముందుగా జాగ్రఫీ ఆప్షనల్‌ సబ్జెక్టు ఉండేది. ఆ తర్వాత ఆంత్రోపాలజీకి మారాను. ఐదేళ్లుగా నేను ప్రిపేర్‌ అవుతున్నాను. ఈ ప్రాసెస్‌లో కుటుంబ సభ్యుల సపోర్టు, ఎమోషనల్‌ సపోర్టు చాలా అవసరం. అది ఉంటే చాలు. సమాచారం, పుస్తకాలు.. అన్నీ ఆన్‌లైన్‌లో ఉచితంగా దొరుకుతాయి. కానీ ఎమోషనల్‌, ఫ్యామిలీ సపోర్టు మాత్రం దొరకదు కదా.. అదే చాలా అవసరం. మహిళలు, పురుషులు ఎవరైనా సరే.. కుటుంబం సపోర్టు చేస్తే సాధించవచ్చు..ఒకవేళ పరీక్షల్లో ఫెయిల్‌ అయినా నిరాశ పడొద్దు. ఎవరి నుంచైనా మనం స్ఫూర్తిపొందవచ్చు. నేను ఐదేళ్ల నుంచి ప్రిపేర్‌ అవుతున్నా. ఈ పరీక్ష ప్రక్రియలో చాలా ఫెయిల్యూర్స్‌ చూశాను. అదే పనిగా విశ్వాసంతో చదువుతూ వెళ్లాను.. నేను ఐఐటీ హైదరాబాద్‌లో సివిల్ ఇంజినీరింగ్‌లో గ్రాడ్యుయేషన్‌ చేశాను. ఆ తర్వాత ఉద్యోగంలో చేరలేదు. సివిల్స్‌ వైపు వెళ్లాలని ముందునుంచీ ఉండటంతో దానిపైనే పూర్తిగా ఫోకస్‌ పెట్టాను. నా తల్లిదండ్రులు కూడా చాలా సపోర్టు ఇచ్చారు. సివిల్స్‌ సాధించే వరకు రాద్దామని నిర్ణయించుకొని రాశాను. నా ఫ్రెండ్స్‌ చాలా సపోర్టు చేశారు.