మత సామరస్యానికి ప్రతీక జాన్ పహాడ్ దర్గా ఉర్సు ఉత్సవాలు..

సూర్యాపేట జిల్లా..

పాలకీడు మండలం జాన్ పహడ్ దర్గాలో వక్స్ బోర్డ్ ఆధ్వర్యంలో నేటి నుండి మూడు రోజుల పాటు ఉర్సు ఉత్సవాలు. తెల్లవారు జామున గుసుల్ ఉత్సవంతో ప్రారంభమైన ఉర్సు వేడుకలు.
భారీగా హాజరవుతున్న భక్తులు. మతసామరస్యానికి ప్రతీకగా.. వందళ ఏళ్ళ నాటి చరిత్ర కలిగిన దర్గా అది. తెలుగు రాష్ట్రాల నుంచే కాక తమిళనాడు, కర్నాటక వంటి రాష్ట్రాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తారు. హిందూ, ముస్లిం అనే తేడా లేకుండా పెద్ద ఎత్తున భక్తులు దర్గాకు వచ్చి తమ మొక్కులు చెల్లించుకుంటారు. మత సామరస్యానికి, మానవత్వానికి, ధైర్యానికి చిహ్నంగా సూర్యాపేట జిల్లా
పాలకవీడు మండలంలోని జాన్ పహాడ్ దర్గా విరాజిల్లుతోంది. పాలకవీడు మండల కేంద్రానికి సుమారు 13 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ జాన్ పహాడ్ దర్గాకు తెలంగాణ నుంచే కాక కర్నాటక, తమిళనాడు నుంచి భక్తులు తరలివస్తారు. ముస్లింల పవిత్రస్థలమైనప్పటికీ హిందువులే అధిక సంఖ్యలో దర్శించుకుంటారు. అందుకే మతసామరస్యానికి ప్రతీకగా ఈ దర్గాను చెప్పుకుంటారు. అభివృద్ధి లేక ప్రాచుర్యంలో వెనకబడి పోయిందే తప్ప… దర్గాకు వందల ఏళ్ల నాటి చరిత్ర ఉంది. సుమారు 400 ఏళ్ళ క్రితం మద్రాస్ రాష్ట్రంలో నాగూర్ గ్రామంలో వెలసిన నాగూర్ షరీఫ్ ఖాదర్ దర్గా విశిష్టతను ఆంధ్రరాష్ట్రంలో కూడా ప్రచారం చేయాలని తలచి జాన్ పహాడ్ సైదా, బాజీ సైదా, మొయినోద్దిన్ అనే భక్తులు బయలుదేరారనే కథ ప్రచారంలో ఉంది. అయితే.. తప్పుడు సమాచారంతో వీరిపై వజీరాబాద్ పాలకులు యుద్ధానికి దిగారు. అందులో వీరు అమరులయ్యారు. ఆ తర్వాత అసలు విషయం తెలిసి.. వజీరాబాద్ రాజకుమారుడు.. ప్రాయశ్చిత్తంగా జాన్పహడ్ దగ్గర దర్గా నిర్మించాడు.
దర్గాకు వచ్చేవారికి మొదట కనిపించేది సఫాయి బావి. భక్తులు ఇక్కడి నుంచే తమ మొక్కులు చెల్లించుకుంటారు. ఈ బావి నీటితో వంట వండి దేవుడికి సమర్పించడం అనవాయితీ. ఇది చాలా పవిత్రమైన బావిగా భక్తులు విశ్వసిస్తారు. ఈ బావిలోని నీటిని పంట పొలాలపై చల్లితే మంచి దిగుబడి వస్తుందని విశ్వసిస్తారు. అలాగే పశుపక్ష్యాదులకు తాగిస్తే ఆరోగ్యంగా ఉంటాయని.. దీర్ఘకాల రోగాలతో బాధపడేవారు ఈ నీటితో స్నానం చేస్తే ఉపశమనం లభిస్తుందని నమ్ముతారు. దర్గా ప్రాంతం అంతా అడవి కావడం వలన అక్కడికి దగ్గరకు వచ్చిన భక్తులు భయపడకుండా రక్షణ కోసం అక్కడ ఒక నాగుపామును, పెద్ద పులిని ఉంచారని పూర్వీకులు చెబుతుంటారు…ఇలా జాన్ పహాడ్ దర్గా లో చాలా రకాల చరిత్రలు దాగి ఉన్నాయి…. కోరిన కోరికలు తీర్చే దర్గా అంటూ ప్రచారం కూడా జరుగుతోంది… ఇక్కడ ప్రతి శుక్రవారం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించడం విశేషం… అందులో భాగంగానే జనవరిలో ఉరుసు ఏర్పాట్లు జరుగుతూ ఉంటాయి.. 27.28.29 ఉరుసు ఉత్సవాలు నిర్వహించడం… నేడు మొదటిరోజు.. శుక్రవారం రోజు గంధం ఊరేగింపు గా వస్తుంది.. ఈ గ్రంధం కోసం భక్తులు భారీ స్థాయిలో తరలి వస్తూ ఉంటారు..

ప్రస్తుతం కరోనా ఎఫెక్ట్ తో భక్తుల తాకిడి కొంత తగ్గేలా ఉన్న స్వామివారి దర్శనానికి వచ్చిన భక్తులకి వచ్చే వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా వక్ప్భోర్డు ఆద్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు…..

నేటి నుండి ముడు రోజుల పాటు ఉర్సు వేడుకలు జరగనున్నాయి…