అమెరికా గ్రాంట్​విల్​లోని ఓ షూటింగ్ రేంజ్​లో కాల్పులు..

అమెరికా గ్రాంట్​విల్​లోని ఓ షూటింగ్ రేంజ్​లో కాల్పులు జరిగాయి. ఓ దుండగుడు చేసిన కాల్పుల్లో గన్ రేంజ్ యజమాని, ఆయన భార్య, మనవడు ప్రాణాలు కోల్పోయారు. కాల్పుల అనంతరం అక్కడి నుంచి 40 ఆయుధాలను దోచుకెళ్లాడని గ్రాంట్​విల్ పోలీసులు తెలిపారు. శుక్రవారం సాయంత్రం ఈ ఘటన జరిగిందని చెప్పారు. రాత్రి 8 గంటలకు ఘటనాస్థలికి చేరుకున్న అధికారులు.. ‘లాక్ స్టాక్ అండ్ బ్యారెల్’ షూటింగ్ రేంజ్ యజమాని థామస్ హాక్(75) మృతదేహాన్ని గుర్తించారు. అతడి భార్య ఎవెలిన్(75), ల్యూక్(17) శవాలు పక్కనే పడి ఉన్నట్లు తెలిపారు…