అమెరికా లొ దారుణం.. తెలుగు విద్యార్థిని కారుతో ఢీ కొట్టి కనీసం పశ్చాత్తాపం లేకుండా వెకిలి చేసిన అమెరికన్ పోలీస్..!

కారుతో గుద్దేసి కనీసం పశ్చాత్తాపం లేకుండా వెకిలి చేసిన అమెరికన్ పోలీస్

కర్నూల్ జిల్లాకు చెందిన కందుల జాహ్నవి (23) ఎంఎస్ చెయ్యడం కోసం అమెరికా వెళ్ళి అక్కడ ఓ రోడ్డు ప్రమాదంలో మృతి చెందింది. అయితే ఆమెని ఢీకొట్టింది ఒక పోలీస్ కారు. కనీసం మానవత్వం చూపకుండా కారుతో గుద్దేసిన తరువాత “ఆమె చనిపోయింది, ఆమె చాలా మాములు మనిషి, 11 వేల డాలర్లు ఇస్తే సరిపోతుంది హహహ ” అంటూ వెకిలిగా నవ్వుతు సీటెల్ పోలీస్ అధికారి డేనియల్ అడరర్ మాట్లాడడం భారతీయుల్ని ఆందోళనకు గురి చేస్తుంది.