అగ్రరాజ్యం అమెరికాలో సరికొత్త వైరస్ వ్యాప్తి..

అగ్రరాజ్యం అమెరికాలో సరికొత్త వైరస్ వ్యాప్తి చెందుతోంది. ఈ వైరస్ ను హ్యూమన్ మెటా న్యుమో వైరస్ (హెచ్ఎంపీవీ) అని పిలుస్తున్నారు. అమెరికాలో దాదాపు అన్ని ప్రాంతాల్లో ఈ వైరస్ విస్తరిస్తోంది. చాలా మందిలో ఈ వైరస్ ఉందనే విషయాన్ని కూడా గుర్తించలేము. ఈ వైరస్ కు వ్యాక్సిన్ లేదు.
ఈ వైరస్ అన్ని వయసుల వారికి సోకుతుంది. ముఖ్యంగా చిన్న పిల్లలు, వృద్ధులు, రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్న వారిపై ఈ వైరస్ ఎక్కువ ప్రభావం చూపుతుంది. హెచ్ఎంపీవీ వైరస్ సోకిన వారికి జలుబు లక్షణాలు ఉంటాయి. రెండు నుంచి ఐదు రోజుల వరకు లక్షణాలు ఉంటాయి. ఆరోగ్యవంతులు వారంతట వారే రికవరీ అయ్యే అవకాశం ఉంది. దగ్గు, జ్వరం, ముక్కు రంధ్రాలు మూసుకుపోవడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు వంటి లక్షణాలు ఈ వైరస్ సోకిన వారికి ఉంటాయి. కరోనా వైరస్ మాదిరే ఇది కూడా ఒక మనిషి నుంచి మరో మనిషికి వ్యాప్తి చెందుతుంది.