అమెరికాలో భారత్ విద్యార్థులకు చుక్కెదురు..ఐదేళ్లపాటు పాటు నిషేధం..!!! అక్కడ రూమ్ లు దొరక్క తీవ్ర ఇబ్బందులు.!.
అమెరికాలో భారత్ విద్యార్థులకు చుక్కెదురు..
ఉన్నత చదువుల కోసం అమెరికాకు వెళ్లిన సుమారు 30 నుంచి 40 మందిని విద్యార్థులకు చేదు అనుభవం ఎదురైంది వీసా తనిఖీలు పూర్తయినా సరైన పత్రాలు లేవని కారణంతో ఇమిగ్రేషన్ అధికారులు వారిని స్వదేశానికి తిప్పి పంపించారు ఏమైనా అభ్యంతరాలు లేవనెత్తితే జైలుకు పంపిస్తామని విద్యార్థులను హెచ్చరించారు ఈ విషయం తమను ఎంతగానో భయభ్రాంతులకు గురి చేసిందని తెలంగాణ ఆంధ్ర చెందిన పలువురు విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు…
భారత్లో పూర్తిస్థాయిలో ఇంటర్వ్యూలు వెరిఫికేషన్ అయిన తర్వాత సెలెక్ట్ చేసి విదేశాలకు పంపిస్తున్నారు.. కానీ ఏ కారణం చేత రిజెక్ట్ చేస్తున్నారో అర్థం కాని పరిస్థితుల్లో కూడా తల్లిదండ్రులు ఉన్నారు.. ముఖ్యంగా
అట్లాంటా, శాన్ ఫ్రాన్సిస్కో, చికాగో లోని ఎయిర్పోర్ట్ వద్ద విద్యార్థులని వెనుతిరిగి ఎయిర్ ఇండియాలో మళ్లీ పంపించారు.. అన్ని సరైన పత్రాలు ఉన్న తర్వాతనే కదా సెలెక్ట్ చేసింది అని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు… ఎంతో ఖర్చులతో వెచ్చించి అక్కడిదాకా పంపించినాక మళ్ళీ వెనక్కి పంపించడం చాలా దారుణం అని ఆవేదంలో ఉన్నారు..
మళ్లీ అనుమతి.?
అమెరికాలోని పలు యూనివర్సిటీల్లో ఉన్నత చదువుల కోసం విద్యార్థులు అమెరికా వెళ్లగా.. సరైన పత్రాలు లేవంటూ అనుమతి నిరాకరించారు. వీసా ప్రక్రియలను పూర్తి చేసినాప్పటికీ.. ఆయా విశ్వవిద్యాలయాల నుంచి అడ్మిషన్లు పొందినా కూడా మెయిల్స్, సోషల్ మీడియా అకౌంట్లను తనిఖీ చేసిన అనంతరం అధికారులు తిరిగి వారిని భారత్‌కు పంపారు…భారతీయ విద్యార్థులను తిరిగి ఎయిర్ ఇండియా విమానంలో భారత్‌కు పంపారు. ఆయా విద్యార్థులు అమెరికాలో ప్రవేశించకుండా ఐదేళ్లపాటు పాటు నిషేధం విధించారు. సరైన డాక్యుమెంట్లు లేకపోవడంతోనే విద్యార్థులను తిప్పిపంపినట్లుగా తెలుస్తుంది. ఇందులో తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు సైతం ఉన్నట్లు సమాచారం.
అక్కడ నివాసాలకి తీవ్ర ఇబ్బంది..
అన్ని సెలెక్ట్ అయి వారు అనుకున్న గమ్యానికి చేరిన అక్కడివారు విద్యార్థులకు ఇవ్వమంటూ వెళ్లగొడుతున్నారు… ఏం చేయాలో అర్థం కాక ఎటు పోవాలో అర్థం కాక ఆవేదనతో మరికొందరు… హోటల్లో ఖరీదైన ఖర్చుతో మరికొందరు… తెలిసినవారు ఇలలో మరికొందరు ఇలా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు తెలుగు విద్యార్థులు ఎందరో…. సరైన గైడ్లైన్స్ ఇప్పి పంపించడంలో కొంత వెనుకబడ్డ అధికారులు… అక్కడికి వెళ్లిన తర్వాత ఏం చేయాలో అర్థం కాని అయోమయంలో విద్యార్థులు… పిల్లలు ఎలా ఉన్నారు అని ఆవేదంలో తల్లిదండ్రులు… ఇలా విదేశీ చదువుల ప్రయాణం అందరిలో తీవ్రస్థాయిలో ఇబ్బందులనే మిగులుస్తుంది…