అమెరికాలో కూలిన జెట్ ఆరుగురు దుర్మ‌ర‌ణం..

అమెరికా:జూలై 09
అమెరికాలోని కాలిఫోర్నియాలో ఓ జెట్ విమానం కుప్పకూలిపోయింది. దీంతో ఆరుగురు దుర్మణంపాలయ్యారు. ఫ్రెచ్‌ వ్యాలీ విమానశ్రయం సమీపంలో సెస్నా బిజినెస్ జెట్ విమానం కూలిపోయింది. ఈ ప్రమాదం జరిగినప్పుడు విమానంలో ఆరుగురు చనిపోయారని రివర్‌సైడ్‌ కౌంటీ షెరీఫ్ అధికారులు తెలిపారు. ఆ విమానం లాస్‌ వెగాస్‌లోని హ్యారీ రీడ్‌ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బయలుదేరిన కొద్దిసేపటికే కుప్పకూలిందన్నారు…ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదని చెప్పారు…