అమెరికా నుంచి అమలాపురానికి చేరుకున్న రోడ్డు ప్రమాద మృతదేహాలు..

*అంబేద్కర్ కోనసీమ జిల్లా*

అమలాపురం…

*అమెరికా నుండి అమలాపురం కు మృతదేహాలు*

*అమెరికా టెక్సాస్ లో రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన అమలాపురం వాసులు…

ఆంధ్రాలోని అమలాపురాని(Amalapuram)కి చెందిన ఒకే కుటుంబంలోని ఆరుగురు వ్యక్తులు అమెరికా(America)లో జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు. ఈదుర్ఘటనలో మరో ముగ్గురు తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రమాదం టెక్సాస్ హైవేపై జరిగింది. చనిపోయిన వారిలో ముమ్మడివరం ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ (Ponnada Satish)బంధువులు ఉన్నట్లుగా గుర్తించారు. మృతులంతా పొన్నాడ సతీష్ చిన్నాన్న నాగేశ్వరరావు కుటుంబ సభ్యులు కావడంతో విషాదఛాయలు అలుముకున్నాయి.
అమెరికాలో ఊహించని రోడ్డు ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఆరుగురు మృత్యువాత పడ్డారు. మరో ముగ్గురు గాయపడ్డారు. ప్రమాదం టెక్సాస్ హైపై జరిగింది. మృతులు అమలాపురం వాసులుగా గుర్తించారు. వీరంతా ముమ్మడివరం ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ బంధువులుగా గుర్తించి సమాచారం చేరవేశారు. చనిపోయిన వారిలో పొన్నాడ సతీష్ చిన్నాన్న నాగేశ్వరరావు, ఆయన భార్య సీతామహాలక్ష్మి, కుమార్తె నవీన గంగ, మనవడు, మనవరాలు ఉన్నారు. నాగేశ్వరరావు అల్లుడు లోకేష్ కు తీవ్రగాయాలయ్యాయి…

*అమెరికా నుండి అమలాపురం వచ్చిన ఐదు మృతదేహాలు..

*ముమ్మిడివరం ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ కుటుంబ సభ్యులకు అమెరికాలో రోడ్డుప్రమాదం..

*అమెరికాలోని టెక్సాస్ లో ట్రక్ ఢీకొని ఐదుగురు దుర్మరణం..

*మృతులు ముమ్మిడివరం ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ చిన్నాన, చిన్నమ్మ, వాళ్ళ కుమార్తె , మనవడు ,మనవరాలు..*

*చిన్నాన పొన్నాడ నాగేశ్వరరావు(68) చిన్నమ్మ సీతా మహాలక్ష్మి (65), కుమార్తె నవీన (38), మనవడు కృతిక్ (11), మనవరాలు నిషిధ (9)..

*అమలాపురంలో ఉంటున్న ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ ఇంటికి చేరిన మృతదేహాలు..

*కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న కుటుంబ సభ్యులు..

*మృతదేహాలను చూసి ఎక్కి ఎక్కి ఏడుస్తున్న ఎమ్మెల్యే పొన్నాడ సతీష్..