LATEST NEWS

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ హరీష్ శంకర్, మ్యూజిక్ మాంత్రికుడు డీఎస్పీ… ఈ ముగ్గురి కాంబినేషన్ వినగానే అభిమానులందరిలోనూ తెలియకుండానే ఓ ఊపు వచ్చేస్తుంది. కొత్త ఉత్సాహం కనిపిస్తుంది. ఇందుకు కారణం వీరి కాంబినేషన్‌లో 11 ఏళ్ల క్రితం రూపొంది, బాక్సాఫీస్ వద్ద పెద్ద హిట్ కొట్టిన గబ్బర్ సింగ్. అందుకే వీరి కాంబినేషన్ లో మళ్లీ ఓ సినిమా తెరకెక్కుతోంది అని వార్త వినగానే అభిమానుల్లో అంచనాలు ఓ స్థాయికి పెరిగిపాయాయి…మొదట భవదీయుడు భగత్ సింగ్ అని పేరు పెట్టినా, తర్వాత ఉస్తాద్ భగత్ సింగ్ అని మార్చారు. దీనికి సంబంధించిన ఫస్ట్ గ్లింప్స్ తాజాగా విడుదల చేసింది మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ. అభిమానుల అంచనాలను ఈ చిత్రం ద్వారా వారు అందుకోగలరా?? అనే ప్రశ్నకు తాజాగా విడుదలైన ఫస్ట్ గ్లింప్స్ చూస్తే అవుననే అనిపిస్తోంది మరి. 11 సంవత్సరాల క్రితం ఇదే రోజున (మే 11) గబ్బర్ సింగ్ విడుదల కావడంతో అదే సెంటిమెంట్ తో ఈ రోజు ఉస్తాద్ భగత్ సింగ్ ఫస్ట్ గ్లింప్స్ వీడియో విడుదల చేసింది. 42 సెకన్ల నిడివి గల ఈ వీడియో ప్రస్తుతం అందరినీ విపరీతంగా ఆకట్టుకుంటోంది..