ఉత్త‌రాఖండ్ సీఎంగా తీర‌థ్ సింగ్ రావ‌త్ ఇవాళ ప్ర‌మాణ స్వీకారం..

ఉత్త‌రాఖండ్ సీఎంగా తీర‌థ్ సింగ్ రావ‌త్ ఇవాళ ప్ర‌మాణ స్వీకారం చేశారు. మాజీ సీఎం త్రివేంద్ర సింగ్ రావ‌త్ మంగ‌ళ‌వారం రాజీనామా చేసిన విష‌యం తెలిసిందే. 56 ఏళ్ల తీర‌థ్ సింగ్ రావత్‌.. పౌరీ నియోజ‌క‌వ‌ర్గం నుంచి ఎంపీగా కొన‌సాగుతున్నారు. 2013 నుంచి 2015 వ‌ర‌కు ఆయ‌న ఉత్త‌రాఖండ్ పార్టీ చీఫ్‌గా బాధ్య‌త‌లు చేప‌ట్టారు. తీర‌థ్ సింగ్‌ను సీఎంగా ఎంపిక చేయ‌డం ప‌ట్ల ఆశ్చ‌ర్యం వ్య‌క్తం అవుతున్న‌ది. ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ శీఘ్ర అనుమ‌తితోనే ఇది జ‌రిగిన‌ట్లు భావిస్తున్నారు. మాజీ సీఎం త్రివేంద్ర సింగ్ రావ‌త్‌పై ఆరోప‌ణ‌లు రావ‌డంతో ఆయ‌న త‌న ప‌ద‌వి నుంచి త‌ప్పుకున్నారు. వ‌చ్చే ఏడాది ఫిబ్ర‌వ‌రిలో ఉత్త‌రాఖండ్‌లో అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి.

రాష్ట్రం పురోగ‌తిలో కొత్త పుంత‌లు తొక్కుతుంద‌ని, ఆ విశ్వాసం త‌న‌కు ఉన్న‌ట్లు ప్ర‌ధాని మోదీ త‌న ట్వీట్

సీఎంగా ప్ర‌మాణ స్వీకారం చేసిన తీర‌థ్ సింగ్ రావ‌త్‌కు ప్ర‌ధాని మోదీ కంగ్రాట్స్ తెలిపారు. తీరథ్‌కు అపార‌మైన పరిపాల‌నా, వ్య‌వ‌స్థీకృత అనుభ‌వం ఉంద‌న్నారు. తీర‌థ్ నేతృత్వంలో రాష్ట్రం పురోగ‌తిలో కొత్త పుంత‌లు తొక్కుతుంద‌ని, ఆ విశ్వాసం త‌న‌కు ఉన్న‌ట్లు ప్ర‌ధాని మోదీ త‌న ట్వీట్‌లో వెల్ల‌డించారు