నిజమైన ప్రజాస్వామ్యానికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది.. ఎంపి ఉత్తమ్ కుమార్ రెడ్డి..

ఈరోజు హైదరాబాద్‌లోని కొంపల్లిలో కాంగ్రెస్ పార్టీ జిల్లా, బ్లాక్, మండల, పట్టణ అధ్యక్షుల శిక్షణా శిబిరానికి ఎంపి కెప్టెన్ ఉత్తమ్ హాజరయ్యారు.

* కాంగ్రెస్ చరిత్ర, భావజాలం మరియు ఆధునిక భారతదేశ నిర్మాణానికి చేసిన భారీ సహకారం పై ఆయన మాట్లాడారు…

* అన్ని స్థాయిలలో సమ్మిళిత వృద్ధి, లౌకికవాదం, సామాజిక న్యాయం,నిజమైన ప్రజాస్వామ్యానికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని ఆయన అన్నారు.
* 1948లో నిజాంను బలవంతంగా భారత యూనియన్‌లో విలీనం చేసింది కాంగ్రెస్ పార్టీయేనని, 2014లో తెలంగాణను ఇచ్చింది శ్రీమతి సోనియాగాంధీ గారే అనే విషయాన్ని గుర్తుచేశారు.
* 1947లో బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా పోరాడి భారతదేశానికి స్వాతంత్య్రం సాధించిపెట్టింది కాంగ్రెస్ పార్టీయేనని ఆయన అన్నారు.
* భారతదేశం ఇప్పుడు ఒక ప్రధాన ఆర్థిక శక్తిగా ఎదిగింది అంటే అది కాంగ్రెస్ ప్రభుత్వాల పుణ్యమే.
* భారతదేశం కోసం కాంగ్రెస్ లక్ష్యం సర్వోదయ అంటే అందరి సామూహిక ఎదుగుదల
* కాంగ్రెస్ పార్టీ ప్రత్యేకించి బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి, సంక్షేమానికి ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందన్నారు…