శ్రీరామనవమి పండుగ సందర్భంగా ఎంపి ఉత్తమ్ కుమార్ రెడ్డి తనపోటిపై కీలక వ్యాఖ్యలు.

50 వేల మెజార్టీ కూడా రాబోతుంది...

శ్రీరామనవమి పండుగ సందర్భంగా శ్రీరాముడు సాక్షిగా నేను హుజూర్ నగర్ నుండే పోటీ చేయబోతున్న… ఎంపి ఉత్తమ్ కుమార్ రెడ్డి..

హుజూర్ నగర్ నియోజకవర్గంలో వేడెక్కుతున్న రాజకీయం….. నిన్న మొన్నటి వరకూ కాంగ్రెస్ పార్టీలో మాజీ టిపిసిసి అధ్యక్షులు ఉత్తంకుమార్ రెడ్డి ఎక్కడ నుంచి పోటీ చేస్తారు అనే సందిగ్ధంలో ఉన్న క్యాడర్ కు శ్రీ రామ నవమి పండుగ సందర్భంగా ఒక క్లారిటీ ఇచ్చారు…. సూర్యాపేట జిల్లా. మఠంపల్లి మండలం రఘునాధపాలెం గ్రామంలో సాంస్కృతిక కార్యక్రమాలు ప్రారంభోత్సవ సందర్భంగా…. కార్యకర్తలను ఉద్దేశించి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ. …… తాను ఎంపీగా లేదా ఎమ్మెల్యే పోటీ చేయాలని ఆలోచన ఉన్నరు అంటూ ప్రచారం జోరుగా ప్రచారం సాగుతోంది…. దానికి అందరి సందేహాలు నివృత్తి చేసేలా నేను హుజూర్ నగర్ నుంచి పోటీ చేయబోతున్నా అని అన్నారు… అది కూడా ఎందుకు అని క్లారిటీ ఇచ్చారు.. హుజూర్ నగర్ ఎమ్మెల్యే ఆగడాలు చూసి హుజూర్ నగర్ నియోజకవర్గ ప్రజలు ఇబ్బందికి గురి కాకూడదనే ఆలోచనతో హుజూర్నగర్ లో పోటీ చేయబోతున్నా, అంతేకాదు 50 వేల మెజార్టీ కూడా రాబోతుందని అన్నారు……. కొంత ఆవేశపూరితంగా మాట్లాడుతూ ఆయన అనుచరులు భూదందాలు చేస్తూ పేదల భూములు లాక్కుంటూ ప్రభుత్వ భూములు కబ్జా చేస్తున్నారని ఆరోపించారు…. అధికారులు టిఆర్ఎస్ పార్టీ కి తొత్తుగా మారి కాంగ్రెస్ కార్యకర్తలపై అడ్డగోలు కేసులతో తీవ్ర స్థాయిలో ఇబ్బందులకు గురి చేస్తున్నారని అన్నారు…… అందరూ రాసిపెట్టుకోండి రానున్నది కాంగ్రెస్ ప్రభుత్వమే మిత్తి మిత్తి వసూలు చేసి ఒక్కొక్కరి సంగతి చూస్తానంటూ ఘాటైన వ్యాఖ్యలు చేశారు….. కార్యకర్తలను అరెస్టు చేసి ఇబ్బందులకు గురి చేస్తే భయపడే వారు ఎవరూ లేరని… అక్రమ అరెస్టులతో ఇబ్బందులకు గురి చేసిన రెట్టింపు ఉత్సాహంతో ఇంకా అడుగులు వేస్తారని కాంగ్రెస్ కార్యకర్తల జోలికి వస్తే ఊరుకునేది లేదని అన్నారు…. హుజూర్ నగర్ నియోజకవర్గంలో రాజకీయ గుండాలు రాజ్యమేలుతున్నారు ఆరోపించారు.. మరో సంవత్సరంలో ఎలక్షన్స్ ఉన్నాయి వీళ్ల ఆగడాలు అన్నిటికీ ముగింపు పలుకుతుందని అన్నారు..