ఉత్తరాఖండ్‌లో వరద విలయం.. 10 మృతదేహాలు లభ్యం, 150 మంది గల్లంతు

ఉత్త‌రాఖండ్‌లోని చ‌మోలి జిల్లాలో ఆదివారం ఉద‌యం నందాదేవి గ్లేసియ‌ర్ విరిగి ప‌డ‌టంతో ధౌలిగంగా న‌దిలో వ‌చ్చిన ఆక‌స్మిక వ‌ర‌ద బీభ‌త్సం సృష్టించింది. వరద ఉధృతి ధాటికి రైనీ గ్రామంలో రుషిగంగ డ్యామ్ కొట్టుకుపోయింది.

ఈ వ‌ర‌దలో 100 మందికిపైగా మృతి చెందిన‌ట్లు భావిస్తున్నారు. అక్క‌డి రిషి గంగా ప‌వ‌ర్ ప్రాజెక్ట్‌లో ప‌ని చేస్తున్న సుమారు 150 మంది కార్మికులు ఈ వ‌ర‌ద‌లో కొట్టుకుపోయారు. వీళ్ల‌లో ఇప్ప‌టి వ‌ర‌కూ 10 మంది మృత‌దేహాల‌ను వెలికి తీయ‌గ‌లిగారు. వంద‌ల మంది ఐటీబీపీ, ఎన్డీఆర్ఆఫ్ సిబ్బంది స‌హాయ‌క చ‌ర్య‌ల్లో పాల్గొంటున్నారు. మూడు హెలికాప్ట‌ర్ల‌లో ఏరియ‌ల్ స‌ర్వేలు నిర్వ‌హిస్తున్నారు. ఈ వ‌ర‌ద‌లో రెండు డ్యామ్‌లు కొట్టుకుపోయాయి.