బిజెపి పార్టీకి మరో బిగ్ షాక్ తగలనుందా…!!ఆగస్టు 30వ తేదీన బిజెపి పార్టీకి వి6 వివేక్ వెంకటస్వామి రాజీనామా..!!!

బిజెపి పార్టీకి మరో బిగ్ షాక్ తగలనుంది. తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు తరుముకొస్తున్న నేపథ్యంలో…
బిజెపి పార్టీ నుంచి ఒక్కో లీడర్… బయటకు వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే బిజెపి పార్టీకి ఊహించని షాక్ ఇచ్చేందుకు సిద్ధమయ్యారు వీ6 వివేక్ వెంకటస్వామి..
ఆగస్టు 30వ తేదీన బిజెపి పార్టీకి వి6 వివేక్ వెంకటస్వామి రాజీనామా చేయనున్నట్లు సమాచారం అందుతుంది. అలాగే అదే రోజున కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారట వి6 వివేక్ వెంకటస్వామి. తెలంగాణ రాష్ట్రంలో బిజెపి పార్టీ చాలా బలహీన పడుతున్న నేపథ్యంలో వి6 వివేక్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది.

కాగా గతంలో వి6 వివేక్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న సంగతి తెలిసిందే. తెలంగాణ ఉద్యమం సమయంలో భారత రాష్ట్ర సమితిలో చేరిన వివేక్… ఆ తర్వాత మళ్లీ బిజెపి లోకి వెళ్ళాడు. ఇక ఇప్పుడు మళ్లీ కాంగ్రెస్ లోకి వెళ్లేందుకు సిద్ధమయ్యారు వివేక్ వెంకటస్వామి..