అజిత్ ‘వలిమై’ రివ్యూ..

కోలివుడ్ టాప్ హీరోలలో ఒకరైన అజిత్ కుమార్ నటించిన లేటెస్ట్ మూవీ వలిమై బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ లెవల్ లో రిలీజ్ ను సొంతం చేసుకుంది…
వలిమై’.. తమిళనాడు థియేటర్లలో ఈ సినిమా సందడి అంతా ఇంతా కాదు! రెండున్నర ఏళ్ల విరామం తర్వాత తమిళ స్టార్ హీరో అజిత్ నటించిన సినిమా థియేటర్లలోకి రావడం ఒకటి అయితే… ఆల్రెడీ విడుదలైన టీజర్, ట్రైలర్లు సినిమాపై తమిళ ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలు పెంచాయి. వెరసి… తమిళ నాట ఫస్ట్ డే టికెట్లలో 95 శాతం అడ్వాన్స్ బుకింక్స్‌లో సేల్ అయ్యాయి…
పెద్దగా ప్రమోషన్స్ లాంటివి లేకుండా తెలుగు రాష్ట్రాలలో మంచి రిలీజ్ నే సొంతం చేసుకున్న ఈ సినిమా ఇక్కడ ఎలాంటి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది, ఆడియన్స్ ను ఎంతవరకు మెప్పించిందో తెలుసుకుందాం పదండీ… ముందుగా సినిమా కథ పాయింట్ విషయానికి వస్తే……

కథేంటి

విశాఖ మొత్తం మర్డర్స్, చైన్ స్నాచింగ్స్, డ్రగ్స్ తో నిండిపోతుంది. మీడియా మొత్తం ఇదే టాపిక్. జనం గోలెత్తిపోతూంటారు. కుర్రాళ్లు డ్రగ్స్ కు బానిసలైపోతూంటారు. హఠాత్తుగా ప్రశాంతంగా ఉండే వైజాగ్ పిశాచ నగరంగా మారిపోయింది. దీని వెనక బైక్ (సైతాన్ స్లేవ్స్) గ్యాంగ్ ఉందని తెలుస్తుంది. ఈ అరాచకాలను కంట్రోలు చేసేవారే లేరా అన్న పరిస్దితుల్లో ఏసీ అర్జున్ కుమార్ (అజిత్ కుమార్) సిటీకు ట్రాన్సఫరై వస్తాడు. అతనో సూపర్ కాప్. ఈ క్రైమ్స్ చేసే గ్యాంగ్స్ వెనక ఉన్న మాస్టర్ మైండ్ కోసం ఇన్విస్టిగేట్ చేస్తాడు. ఆ క్రమంలో ఆ గ్యాంగ్ లీడర్ నరేన్ (కార్తికేయ) గురించి తెలుసుకుంటాడు. టెక్నాలజీ సాయంతో ఇదంతా అతనే చేస్తున్నట్లు తెలుస్తుంది. జాబ్ లు లేని యూత్ ను ఒక చోట చేర్చి నరేన్ ఇదంతా చేయిస్తుంటాడు.అతన్ని పట్టుకోవటానికి అర్జున్ వల వేస్తాడు. కానీ రివర్స్ లో పోలీస్ లు క్రిమినల్స్ వెనక పడటం మానేసి అర్జున్ వెనక పడతాడు.అతన్ని చంపటానికి చూస్తారు…అసలేం జరిగింది. చివరికి ఏసీపీ అర్జున్, కార్తికేయ క్రైమ్స్ ను ఎలా బయటపెట్టాడు. ఈ కేసుని ఎలా సాల్వ్ చేసాడు అన్నది మిగతా కథ…

ఇక కార్తికేయ నాని గ్యాంగ్ లీడర్ తర్వాత మరో సారి నెగటివ్ రోల్ లో నటించగా మరోసారి అలాంటి క్యారెక్టర్ తోనే మెప్పించాడు కార్తికేయ….మిగిలిన రోల్స్ లో హ్యుమా ఖురేషి చిన్న రోల్ లో ఆకట్టుకోగా మిగిలిన రోల్స్ కి పెద్దగా స్కోప్ లేదు…. ఇక సంగీతం జస్ట్ ఓకే అనిపించగా చాలా వరకు కథకి అడ్డుకట్టగా నిలిచింది అని చెప్పాలి… కానీ బ్యాగ్రౌండ్ స్కోర్ విషయంలో మాత్రం…….

మొత్తం మీద యాక్షన్ మూవీస్ ఇష్టపడే వాళ్ళకి కొంచం ఓపికతో చూస్తె సినిమా పర్వాలేదు అనిపిస్తుంది కానీ లెంత్ కొంచం తగ్గించి ఉంటే మరింత బెటర్ అనిపించేది…. ఓవరాల్ గా యాక్షన్ మూవీస్ ఇష్టపడే వాళ్ళ కి సినిమా నచ్చే అవకాశం ఉంటుంది, రెగ్యులర్ ఆడియన్స్ కొంచం ఓపికతో చూస్తె ఒకసారి చూడొచ్చు అనిపిస్తుంది…..