రాముడి సాక్షిగా డీకే అరుణ 15 కోట్లు డిమాండ్ చేసింది : వంశీచంద్ రెడ్డి..

*మహబూబ్ నగర్*:- రాముడి సాక్షిగా అప్పటి కాంగ్రెస్ నాయకురాలు డీకే అరుణ 2019 పార్లమెంటు ఎన్నికల సందర్భంగా మహబూబ్ నగర్ పార్లమెంటు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరపున పోటీ చేసేందుకు 15 కోట్లు రూపాయలను డిమాండ్ చేసిందని, కాంగ్రెస్ సీడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానితుడు,మాజీ ఎమ్మెల్యే చల్లా వంశీచంద్ రెడ్డి రామాలయంలో ప్రమాణం చేశారు.ఈ సందర్భంగా ఆయన ఆదివారం పట్టణలోని టీచర్స్ కాలనీలో గల రామాలయానికి వచ్చి డీకే అరుణ కోసం ఎదురు చూసి ప్రమాణం చేసిన అనంతరం మీడియాతో మాట్లాడారు.డీకే అరుణ పై తాను చేసిన సవాల్ ను ఆమె స్వీకరించిందని, ఆమె చెప్పిన విధంగా ఆమెకు అనుకూలమైన తేదీ,సమయానికే తాను ఉదయం 11 గంటలకే రామాలయానికి వచ్చానని, ఆమె రాలేదంటే, ఎందుకు రాలేదో పాలమూరు ప్రజలు అర్థం చేసుకోవాలని అన్నారు. నిజం ఎటువైపు ఉంది,నిజాయితీ ఎటువైపు ఉందో పాలమూరు ప్రజలు గమనించాలని అన్నారు. అవినీతి, విలువలు లేని రాజకీయాలు చేయాలని, నిజం ఎప్పుడూ విజయం వైపే ఉంటుందని ఆయన అన్నారు.ఈ సమావేశంలో ఎమ్మెల్యే లు యెన్నం శ్రీనివాసరెడ్డి, వాకిట శ్రీహరి, మారెపల్లి సురేందర్ రెడ్డి, ఎన్పీ వెంకటేష్, ఆనంద్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.