సికింద్రాబాద్-తిరుపతి వందేభారత్ రైళ్ల టికెట్ ధరల ఖరారు.. సికింద్రాబాద్ నుంచే ఎక్కువ ధర!.

*సికింద్రాబాద్-తిరుపతి వందేభారత్ రైళ్ల టికెట్ ధరల ఖరారు.. సికింద్రాబాద్ నుంచే ఎక్కువ ధర!.

సామాన్యులకు అందుబాటులో లేని టికెట్ రేట్లు..*

*సికింద్రాబాద్-తిరుపతి వందేభారత్ రైలును ప్రారంభించనున్న ప్రధాని మోదీ*

*సికింద్రాబాద్.. రేపటి నుంచి రైలు అందుబాటులోకి
తొలుత ఏడు ఏసీ చైర్ కార్లు, ఒక ఏసీ ఎగ్జిక్యూటివ్ కోచ్‌తో రైలు

డిమాండును బట్టి ఆ తర్వాత పెంచే వీలు..సికింద్రాబాద్ నుంచి వెళ్లే రైలులో టికెట్ ధర రూ. 50 అధికం

సికింద్రాబాద్-తిరుపతి వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలును ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేడు ప్రారంభించనున్నారు. రేపటి నుంచి రైళ్లు ప్రయాణికులకు అందుబాటులోకి వస్తాయి. ఈ నేపథ్యంలో రైల్వే అధికారులు టికెట్ ధరలను ఖరారు చేశారు. దూరాన్ని, ప్రయాణించే బోగీని బట్టి ధరలు నిర్ణయించారు. కనిష్ఠ ధర రూ. 470 కాగా, గరిష్ఠంగా రూ. 3,080గా ఖరారు చేశారు. సికింద్రాబాద్ నుంచి తిరుపతికి చైర్ కారు టికెట్ ధర రూ. 1,680. తిరుపతి నుంచి సికింద్రాబాద్ కంటే, సికింద్రాబాద్ నుంచి తిరుపతి టికెట్ ధర రూ. 50, రూ. 55 ఎక్కువగా ఉంది. తిరుపతి-సికింద్రాబాద్ రైలు రేపు, సికింద్రాబాద్-తిరుపతి రైలు ఎల్లుండి నుంచి ప్రయాణికులకు అందుబాటులోకి వస్తుంది.

సికింద్రాబాద్-తిరుపతి వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలును తొలుత 8 బోగీలతోనే నడిపిస్తారు. ఇందులో 7 ఏసీ చైర్‌కార్లు, ఒకటి ఏసీ ఎగ్జిక్యూటివ్ కోచ్ ఉంటాయి. మొత్తం 530 మంది వరకు ప్రయాణించొచ్చు. డిమాండును బట్టి కోచ్‌లను పెంచే అవకాశం ఉంది. ఈ రైళ్లకు ఇప్పటికే బుకింగులు ప్రారంభం కాగా తిరుపతి నుంచి బయలుదేరే తొలి రైలులో ఏసీ చైర్ కార్, ఎగ్జిక్యూటివ్ కోచ్‌లలోనీ సీట్లు నిండిపోయి వెయిటింగ్ లిస్టుకు చేరుకున్నాయి. సికింద్రాబాద్ నుంచి బయలుదేరే రైలులో కూడా ఇదే పరిస్థితి ఉంది. తిరుపతి నుంచి సికింద్రాబాద్ కంటే సికింద్రాబాద్ నుంచి తిరుపతికి వెళ్లే రైలులో ఎగ్జిక్యూటివ్ కోచ్ టికెట్ ధర రూ. 50, చైర్ కార్ ధర రూ. 55 ఎక్కువగా ఉండడం గమనార్హం.

సికింద్రాబాద్ నుంచి చైర్‌కార్, ఎగ్జిక్యూటివ్ ధరలు వరుసగా..
* నల్గొండకు రూ. 470, రూ. 900
* గుంటూరుకు రూ. 865, రూ. 1,620
* ఒంగోలు రూ. 1,075, రూ. 2,045
* నెల్లూరు రూ. 1,270, రూ. 2,455
* తిరుపతి రూ. 1,680, రూ. 3,080

తిరుపతి నుంచి చైర్‌కార్, ఎగ్జిక్యూటివ్ ధరలు వరుసగా
* నెల్లూరుకు రూ. 555, రూ. 1,060
* ఒంగోలు రూ. 750, రూ. 1,460
* గుంటూరు రూ. 955, రూ. 1,865
* నల్గొండ రూ. 1,475, రూ. 2,730
* సికింద్రాబాద్ రూ. 1,625, రూ. 3,030