తెలంగాణ నుంచి మూడో వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌ ప్రారంభం..

తెలంగాణ నుంచి మూడో వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌ను కేంద్ర ప్రభుత్వం ప్రారంభించబోతోంది.

దేశంలో తెలంగాణా రాష్ట్రానికి ఇస్తున్న ప్రాధాన్యతను చెప్పే ప్రయత్నం చేస్తుంది కేంద్రంలోని బీజేపీ సర్కార్. తెలంగాణా రాష్ట్రానికి మూడో వందే భారత్ ఎక్స్ప్రెస్ త్వరలో ప్రారంభం కానున్నట్టు ప్రకటించింది . ఈ నెల 24 వ తేదీన భారత ప్రధాని నరేంద్ర మోడీ ఈ రైలును వర్చువల్ గా ప్రారంభించనున్నారు..

ఇప్పటికే సంక్రాంతి గిఫ్ట్‌గా సికింద్రాబాద్-విశాఖపట్టణం వందేభారత్ రైలు, ఉగాది కానుకగా సికింద్రాబాద్-తిరుపతి వందేభారత్ రైలును కేంద్రం ప్రారంభించగా.. ఇప్పుడు వినాయక నవరాత్రుల కానుకగా.. నేడు కాచిగూడ-బెంగళూరు వందే భారత్ రైలును ప్రారంభించనుంది. మధ్యాహ్నం పన్నెండుర గంటలకు కాచిగూడలో ఈ రైలు ప్రారంభోత్సవ కార్యక్రమం జరగనుంది. ఢిల్లీ నుంచి ప్రధాని మోడీ ఈ రైలును వర్చువల్‌గా ప్రారంభించనున్నారు. అయితే మిగతా వందేభారత్ రైళ్ల తరహాలో కాకుండా ఇందులో కేవలం ఎనిమిది కోచ్‌లు మాత్రమే ఉంటాయి..