సామాన్యుడికి కేంద్రం ప్రభుత్వం మరో ఊరటనిచ్చే వార్త తెలిపింది…

సామాన్యుడికి కేంద్రం ప్రభుత్వం మరో ఊరటనిచ్చే వార్త తెలిపింది. దేశవ్యాప్తంగా వంటనూనె ధరలు తగ్గించినట్లు వెల్లడించింది. ఈ మేరకు పామాయిల్‌పై రూ.20, వేరుశెనగ నూనెపై రూ.18, సోయాబీన్‌పై రూ.10‌, పొద్దుతిరుగుడు నూనెపై రూ.7 ధరలు తగ్గిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయ తీసుకుంది. కాగా, ఇటీవల ఇంధన ధరలపై కూడా ఎక్సైజ్‌ సుంకాన్ని కేంద్రం తగ్గించిన సంగతి తెలిసిందే.