వారణాసిలో అత్యంత విలాసవంతమైన గంగా విలాస్ షిప్ ను ప్రారంభించిన ప్రధాని మోడీ.

వారణాసిలో అత్యంత విలాసవంతమైన గంగా విలాస్ షిప్ ను ప్రారంభించారు ప్రధాని మోడీ. వారణాసి నుంచి దిబ్రూగఢ్ వరకు ఈ నౌక యాత్ర చేపట్టనున్నారు. ప్రపంచంలోనే అత్యంత పొడవైన నదీ ప్రయాణంగా గంగా విలాస్ నిలవనుంది. 52 రోజుల్లో దాదాపు 3200 కి.మీ ప్రయాణించనుంది. 15 రోజుల పాటు బంగ్లాదేశ్ లోనే ప్రయాణం సాగనుంది. గంగా, బ్రహ్మపుత్ర నదుల్లో ఈ నౌక ప్రయాణం సాగనుంది.