లేటెస్ట్ మూవీ ‘వారిసు’ తెలుగులో ‘వారసుడు’..

తమిళ సూపర్ స్టార్ విజయ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వారిసు’ తెలుగులో ‘వారసుడు’…
ఈ సినిమాను టాలీవుడ్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి రూపొందిస్తున్నాడు. తాజాగా ఈ మూవీ నుంచి లేటెస్ట్ అప్ డేట్ వచ్చింది. ఈ సినిమాలోని ఫస్ట్ సాంగ్ రానుంది. దీనికి సంబంధించిన ప్రోమోను ఇవాళ సాయంత్రం మేకర్స్ రిలీజ్ చేయనున్నారు. ఈ మేరకు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ ట్విట్టర్ ద్వారా స్పెషల్ పోస్టర్ విడుదల చేసింది. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర పోస్టర్స్ సినిమాపై ఆసక్తినిరేపుతున్నాయి…కాగా, విజయ్ కి ఇది 66వ మూవీ. ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌, పీవీపీ బ్యానర్లపై నిర్మాతలు దిల్ రాజు, శిరీష్, పరమ్ వి పొట్లూరి, పెరల్ వి పొట్లూరి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా ఈ సినిమా థియేటర్లలో విడుదల కాబోతోంది. థమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. ఇందులో విజయ్ సరసన రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తోంది.