భారతదేశంలోనే మొట్టమొదటి లెస్బియన్ సినిమా.. వర్మ దర్శకత్వంలో……

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో నైనా గంగూలీ, అప్సర రాణి ప్రధాన పాత్రధారులుగా, సుప్రీం కోర్టు సెక్షన్ 377 రద్దు చేసిన తర్వాత ఇండియా లో మొట్ట మొదటి లెస్బియన్ నేపథ్యం లో క్రైమ్ డ్రామా గా “మా ఇష్టం” చిత్రం రూపొందింది. విభిన్న క‌థాంశంతో రూపొందిన ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకుంది. ఏప్రిల్ 8వ తారీఖున‌ థియేటర్లలో ఈ చిత్రం విడుదల చేయ‌నున్న‌ట్టుగా చిత్ర బృందం ప్రకటించింది…

..ఇండియాలోనే మొదటి లెస్బియన్ స్టోరీ రాంగోపాల్ వర్మ ఎప్పటికప్పుడు ఏదో ఒక ప్రయోగం చేయాలని భావిస్తూ ఉంటారు. అందులో భాగంగానే భారతదేశంలోనే మొట్టమొదటి లెస్బియన్ చిత్రాన్ని ఆయన తెరకెక్కించారు. ఈ మూవీ కోసం హాట్ బ్యూటీలు నైనా గంగూలీ, అప్సరా రాణిలను రంగంలోకి దించారు వర్మ. ఇండియాలో తొలి లెస్బియన్ మూవీగా ఈ సినిమా త్వరలోనే విడుదల కాబోతోంది..