నాగబాబు పెంపకంపై వరుణ్ తేజ్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్…

నాన్నగా నాపై, నిహారికపై చాలా జాగ్రత్తగా ఉంటాడు....

నటుడు నాగబాబు కూతురు నిహారిక, కుమారుడు వరుణ్ తేజ్ కూడా టాలీవుడ్ ఇండస్ట్రీలో తమకంటూ ఓ గుర్తింపు సొంతం చేసుకున్నారు. ఇక నిహారిక కొంతవరకు కొన్ని సినిమాలలో నటించిన కూడా ఆ తర్వాత అంతగా అవకాశాలు అందుకోలేకపోయింది. కానీ వరుణ్ తేజ్ మాత్రం మంచి సక్సెస్ లతో ముందుకు దూసుకెళ్తున్నాడు. వరుసగా క్రేజీ ఆఫర్లు అందుకుంటూ వెనుదిరిగి చూడకుండా సాగుతున్నాడు. ఇక ఆయన నటించిన ‘గని’ సినిమా కూడా త్వరలో విడుదల కావడానికి సిద్ధంగా ఉంది. ఈ నేపథ్యంలో ఆయన పలు ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నాడు. ఈ క్రమంలో తన తండ్రి నాగబాబు గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. నాన్నగా నాపై, నిహారికపై చాలా జాగ్రత్తగా ఉంటాడని వరుణ్ చెప్పాడు. అయితే ఇవి ప్రతి తండ్రి చెప్పే వ్యాఖ్యలైన.. మొన్న పబ్ పై పోలీసుల రైడింగ్ లో నిహారిక దొరకటం.. అర్ధరాత్రి నుండి తెల్లవారు జామున వరకు పోలీస్ స్టేషన్ లో ఉండటం..
ఆ పార్టీలో డ్రగ్స్ పెద్ద ఎత్తున దొరకడంతో.. నాగబాబు, నిహారికపై పలు విమర్శలు వచ్చాయి. ఈ క్రమంలో తన తండ్రి నాగబాబు పెంపకంపై వరుణ్ తేజ్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
‘గని’ చిత్ర విశేషాలతో పాటు.. తన తండ్రి నాగబాబు గురించి ఇంట్రస్టింగ్ విషయాలను పంచుకున్నారు వరుణ్ తేజ. ఆస్క్ నాగబాబు ద్వారా మీ నాన్నగారు పలు ప్రశ్నలకి జవాబిస్తుంటారు. మరి నాగబాబుకి మీరు అడగాలి అనుకుంటున్నా ప్రశంలు ఏమైనా ఉన్నాయా అని యాంకర్ అడిగిన ప్రశ్నకి వరుణ్ తేజ్ బదులిస్తూ.. ఇంతకు ముందు అయితే చాలా ప్రశ్నలు ఉండేవి.. కానీ ఇప్పుడేం లేవు. నేను అడగాల్సిన ప్రశ్నలన్నీ ఇప్పటికే అడిగేశా.. ఫ్యాన్స్ అడిగే ప్రశ్నల్లో కూడా చాలావరకూ నేను అడిగేశా’ అని చెప్పాడు వరుణ్. ఇక నిహారికను నన్ను నాన్న గారు ఫోన్ చేసి ఎక్కడున్నారు అని అడుగుతుంటారు.. దయచేసి అలా అడగొద్దని మేం చెప్తూనే ఉంటాం.. కానీ ఆయనకి ఇప్పటికీ అలవాటు షూటింగ్‌లో ఉంటే ఫోన్ చేసి ఎక్కడ అని అడుగుతారు. నాన్నా షూటింగ్‌లో ఉన్నాం అని అంటే.. త్వరగా వచ్చేయండి అని అంటారు. త్వరగా ఎలా వస్తాం.. షూటింగ్‌లో ఉంటే.. బట్ ఆయన ఫాదర్‌గా అడుగుతుంటారు అని నాగబాబు తండ్రి ప్రేమ గురించిచెప్పుకొచ్చాడు నాగబాబు.