కాంగ్రెస్ పార్టీకి మ‌రో షాక్..మాజీ ప్ర‌ధాని లాల్ బ‌హ‌దూర్ శాస్త్రి మ‌నువ‌డు విభాక‌ర్ శాస్త్రి పార్టీకి రాజీనామా.. బీజేపీ లో చేరిక..!!.

మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి చవాన్ రాజీనామా ఘటన మరువక ముందే కాంగ్రెస్ పార్టీకి మ‌రో షాక్ త‌గిలింది. మాజీ ప్ర‌ధాని లాల్ బ‌హ‌దూర్ శాస్త్రి మ‌నువ‌డు విభాక‌ర్ శాస్త్రి పార్టీకి రాజీనామా చేశారు. రాజీనామా చేసిన వెంటనే బీజేపీలో చేరారు. బీజేపీలో చేరిన తర్వాత విభాకర్ శాస్త్రి తన ప్రకటనలో, “ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో , లాల్ బహదూర్ శాస్త్రి యొక్క ‘జై జవాన్, జై కిసాన్’ విజన్‌ని మరింత బలోపేతం చేయడం ద్వారా నేను దేశానికి సేవ చేయగలనని భావిస్తున్నానని తెలిపారు..కాంగ్రెస్ వ‌ర్కింగ్ క‌మిటీలో చోటు ద‌క్క‌క‌పోవ‌డంతో విభాక‌ర్ శాస్త్రి మ‌న‌స్తాపంతో ఉన్న‌ట్లు తెలుస్తోంది. ఆయ‌న ఇవాళే బీజేపీలో చేరుతార‌న్న వార్తలు వినిపిస్తున్నాయి.ప్రియాంక గాంధీకి విభాకర్ శాస్త్రి సలహాదారుగా ఉన్నారు. పార్టీ అధిష్టానం నిర్ణయంపై మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి మనవడు విభాకర్ శాస్త్రి కొంతకాలంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. 2023 ఆగస్టులో పార్టీ కార్యవర్గంలో చోటు దక్కకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు..