విజయ్ కామెంట్ చేస్తేనే పరీక్షలకు ప్రిపేర్ అవుతాం…విజయ్‌పై అలాంటి వీడియో.. సోషల్ మీడియాలో వైరల్!

విజయ్ దేవరకొండకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఓ రేంజ్‌లో ఉంటుంది. లేడీ ఫ్యాన్స్ కూడా చాలా ఎక్కువ. రీసెంట్‌గా ఇద్దరు విద్యార్ధినులు విజయ్ కోసం పెట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది..విజయ్ కామెంట్ చేస్తేనే పరీక్షలకు ప్రిపేర్ అవుతామంటూ ఆ అమ్మాయిలు పెట్టిన పోస్టు చూసి అందరూ షాకయ్యారు. మరి వీళ్లకి అంత పెద్ద హీరో రిప్లై ఇచ్చాడా?..ప్రతి ఒక్కరికి అభిమాన హీరోలు ఉంటారు. వాళ్లతో మాట్లాడాలని.. ఒకసారైనా చూడాలని ఆశపడుతుంటారు. కొందరు వీరాభిమానులు అయితే తమ హీరో ఏం చెబితే అది చేస్తుంటారు. అయితే ఇద్దరు విద్యార్ధినులు తమ అభిమాన హీరో విజయ్‌కి ఏం రిక్వెస్ట్ చేసారో తెలిస్తే ఆశ్చర్యపోతారు. విజయ్ తమ వీడియోకి కామెంట్స్ పెడితేనే పరీక్షలకు ప్రిపేర్ అవుతామంటూ పోస్టు పెట్టారు. ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది. మీ వీడియో విజయ్ చూసి కామెంట్ చేసేంత సీన్ ఉందా? అంటూ చాలామంది వీరిని వెక్కిరించారు. ఈ పోస్టు అటు తిరిగి.. ఇటు తిరిగి విజయ్ కంట పడింది. అంతే అలాంటి కామెంట్స్‌కి దిమ్మ తిరిగేలా విజయ్ కామెంట్ చేసారు. ’90 మార్కులు తెచ్చుకుంటే తెచ్చుకుంటే తప్పకుండా కలుస్తా’.. అంటూ ఆ విద్యార్ధినులను ఉద్దేశించి కామెంట్ చేసారు. ప్రస్తుతం విజయ్ పెట్టిన కామెంట్ వైరల్ అవుతోంది. విజయ్ స్పందించిన తీరుపై నెటిజన్లు ప్రశంసలు కురిపించారు..విజయ్ దేవరకొండ ప్రస్తుతం ‘ఫ్యామిలీ స్టార్’ సినిమాతో బిజీగా ఉన్నారు. పరశురామ్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ ఏప్రిల్ 5న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది. మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాని దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి…