ఉద్దేశపూర్వకంగానే నా ఇంట్లో సోదాలు చేశారు-విజయసాయి.
మా ఇంట్లో రూ.6 లక్షలు ఉన్నాయి..
మా అమ్మ ఆస్పత్రి ఖర్చుల కోసం డబ్బు ఉంచుకున్నాం
ED సోదాలు చేయాల్సింది చంద్రబాబు ఇంట్లో
చంద్రబాబుకి వయసు పెరిగింది..చావుకి దగ్గర అవుతున్నారు-
జీవిత చరమాంకంలో అయినా మంచిపనులు చేయాలి
చంద్రబాబు నెలకు రూ.5 వేల కోట్లు సంపాదిస్తున్నారు
ఏడాదికి రూ.6 వేల కోట్లు విదేశాల్లో దాచుకున్నారు
చంద్రబాబు డర్టీ పొలిటీషియన్ అని..KCR ఎప్పుడో చెప్పారు-.
త్వరలో రాజకీయ ప్రవేశం చేస్తా
జులైలో పార్టీ ప్రకటిస్తా అన్నారు.. మీడియా రంగంలోకి కూడా వస్తున్నా
చంద్రబాబు అవినీతిని ఎండగడతా విజయసాయిరెడ్డి అన్నారు..
Vijayasai Reddy New Party: రాజకీయాల్లోకి రీఎంట్రీ.. కొత్త పార్టీ ఆవిర్భావం
త్వరలోనే తాను రాజకీయాల్లోకి రీఎంట్రీ ఇస్తానని విజయసాయి రెడ్డి ప్రకటించారు. జూలై నెలలో కొత్త రాజకీయ పార్టీని ప్రకటిస్తానని వెల్లడించడం రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మరో రాజకీయ పార్టీ ఆవిర్భవించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.
వైసీపీపై ఘాటు విమర్శలు
ఇదే సమయంలో తాను సుదీర్ఘకాలం పనిచేసిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSRCP)పై కూడా ఆయన విమర్శలు గుప్పించారు. ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయిన వైసీపీ, ఇప్పటికైనా జరిగిన తప్పుల నుంచి బుద్ధి తెచ్చుకోవాలని హితవు పలికారు. వైసీపీ నాయకత్వంపై అసంతృప్తితో ఉన్న ఆయన, తనదైన శైలిలో కొత్త ప్రయాణానికి సిద్ధమవుతున్నట్లు సంకేతాలిచ్చారు.విజయసాయి రెడ్డి కొత్త పార్టీ ప్రకటన ఏపీ రాజకీయాల్లో ఎలాంటి మార్పులకు దారితీస్తుందో చూడాలి.