ఈనెల 23న విజయదశమి…

*ఈనెల 23న*
*విజయదశమి*

*మంగళవారం న‌‌ లేని శ్రవణ నక్షత్రం*
*శమీ పూజకు ప్రధానం శ్రవణా నక్షత్రం*

అయోమయం గందరగోళం మధ్య హిందూ సంప్రదాయ పండుగలు ప్రతి సంవత్సరం ప్రజలను తికమక పెడుతున్నాయి. అందులో భాగంగా ఈ సంవత్సరం కూడా విజయదశమి ఏ రోజున అనే విషయంలో దోబూచులాడుతుంది. ధర్మశాస్త్ర గ్రంథాలైన *నిర్ణయ సింధు, ధర్మసింధు* ప్రకారము విజయదశమి 23న సోమవారం రోజు జరుపుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది…

*అసలు కారణం ఏమిటి?*..

విజయదశమి పండగ ఏ రోజున అనే విషయమై గందరగోళ పరిస్థితులను తెరదించే ప్రయత్నంలో భాగంగా విజయదశమి పండుగ పై పూర్తి వివరణ ఇది ….

విజయదశమి పండుగకు ప్రధానంగా కావలసినది దశమితో కూడిన శ్రవణా నక్షత్రం…
ఈ శ్రవణా నక్షత్రం సమయంలోనే శమీ పూజ జరపవలసి ఉంటుంది. శమీ పూజకు అత్యంత ప్రాధాన్యమైనది. శ్రవణా నక్షత్రం 22వ తారీకు ఆదివారం సాయంత్రం గంటలు 3:35 నిమిషములకు వచ్చి తెల్లవారి సోమవారం 23వ తేదీ సాయంత్రం గంటలు 3:35 నిమిషముల వరకు ఉంటుంది.మంగళవారం నాడు ధనిష్ట నక్షత్రం చొరబడుతుంది.ధనిష్ట నక్షత్రం విజయదశమి పండుగకు విరుద్ధం.
ఈ ప్రకారంగా సోమవారంనాడు అపరాహ్ణ ముహూర్తం లో దశమి పగలు గంటలు 2:29 నిమిషములకు వరకు ఉంది. అపరాహ్ణ కాలము పగలు గంటలు 1:00 నుండి మధ్యాహ్నము గంటలు 3: 28 వరకు ఉంటుంది. ఈ సమయంలో శ్రవణా నక్షత్రముతో దశమి కూడితే అది విజయదశమి అవుతుంది. కనుక దశమి తో శ్రవణ నక్షత్రం కూడినందున తేదీ *23 -10- 2023 సోమవారం* రోజు *దసరా పండుగ*,*శమీ పూజ* జరుపుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది.

శృంగేరి పీఠంలో కూడా విజయదశమి శమీ పూజ సోమవారము నిర్వహిస్తున్నట్లు పీఠం నిర్వాహకులు వెల్లడించారు.
రాష్ట్రంలోని ప్రసిద్ధ *వేములవాడ క్షేత్రంలోను, వరంగల్ లోని భద్రకాళి క్షేత్రంలోను 23వ తేదీని దసరా ఉత్సవాలను* నిర్వహిస్తున్నారు.

*ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోని పలు*
*దేవస్థానాలలో 23 వ తారీఖున* *జరుపుకోవాలని చెబుతున్నారు*
*తిరుమల తిరుపతి దేవస్థానం* *పంచాంగం 23 విజయదశమి తిరుపతిలో ఆచరించుచున్నారు*
*ఆంధ్రప్రదేశ్ దేవాదాయ ధర్మాదాయ శాఖ పంచాంగం అనుసరించి* *విజయవాడ కనకదుర్గ దేవాలయం 23 సోమవారం రోజున దసరా పండగ చేయుచున్నారు*
*తెలంగాణ విద్వత్ సభ పంచాంగ కర్తలందరూ కలసి గత మాసంలోనేతిరుమల తిరుపతి దేవస్థానం పంచాంగం 23* *విజయదశమి తిరుపతిలో ఆచరించుచున్నారు*
*ఆంధ్రప్రదేశ్ దేవాదాయ ధర్మాదాయ శాఖ పంచాంగం అనుసరించి విజయవాడ కనకదుర్గ దేవాలయం 23 సోమవారం రోజున దసరా పండగ చేయుచున్నారు*
*తెలంగాణ విద్వత్ సభ పంచాంగ* *కర్తలందరూ కలసి గత మాసంలోనే విజయదశమి 23 సోమవారం జరుపుకోవాలని నిర్ణయించినారు*
*ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా 23 సోమవారం విజయదశమి జరుపుకొనుటకు ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు.అందువల్ల 23 వ,తేదీ సోమవారం రోజున దసరా పండుగ శమీ జరుపుకోవడం అందరికీ శ్రేయస్కరం.

*భగవత్ భక్తులందరికీ దసరా శుభాకాంక్షలు… కోహెడ శ్రీ సీతారామచంద్ర స్వామి* వారి దీవెనలు.

*సర్వేజనః సుఖినోభవంతు*.