దుర్గాపూజ (Durga Puja) సందర్భంగా మహా అష్టమి పండుగను జరుపుకుంటారు. ఈ రోజున కన్యా పూజకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది..
పండుగను ఘనంగా జరుపుకుంటూంటారు. ఈ దసరానే విజయదశమి అని కూడా అంటారు. రావణుడిపై రాముడి విజయం సాధించినందుకు.. దక్షిణాది రాష్ట్రాల్లో దసరాని జరుపుకుంటూంటారు. అలాగే.. తూర్పు, ఈశాన్య రాష్ట్రాల్లో.. రాక్షసుల రాజు.. మహిషాసురిడిని అంతమొందించి.. దుర్గమ్మ.. విజయం సాధించినందుకు విజయదశమిని చేసుకుంటూంటారు. అయితే.. ఈ పండుగ రోజున.. పాలపిట్టను చూస్తే మంచిదని.. నానుడి. విజయదశమి రోజున ఈ పిట్టను చూడగలగటాన్ని ఎంతో అదృష్టంగా,..
. దీని తరువాత, నవమి నాడు హవనాన్ని నిర్వహిస్తారు.ఇంట్లో శ్రేయస్సు ,సంతోషాన్ని తీసుకురావాలని కోరుకుంటారు. ఈసారి విజయదశమి (Dussehra ) పండుగను 2023 అక్టోబర్ 23న జరుపుకోనున్నారు. ఈ రోజున పక్షిని చూడటం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. విజయదశమి రోజున ఈ పక్షిని చూడటం వల్ల ఆశించిన ఫలితాలు లభిస్తాయి.
విజయదశమి అని చెప్పగానే పాలపిట్టను చూడాలని పెద్దలు చెబుతారు. అసలు దసరాకు పాలపిట్టకు ఏం సంబంధం ఉందో తెలుసుకుందాం..
సాధారణ రోజులు కనిపించినా, కనిపించకపోయినా దసరారోజు మాత్రం పాలపిట్ట కచ్చితంగా కనిపిస్తుందని అంటారు. అందుకే గ్రామాల్లో విజయదశమిరోజు పొలాల్లోకి వెళ్లి మరి పాలపిట్టను చూస్తారు. పురాణాల ప్రకారం జూదంలో రాజ్యం కోల్పోయిన పాండవులకు అరణ్యవాసం ముగించుకుని తిరిగి రాజ్యానికి వస్తుండగ పాలపిట్ట కనిపించిందట. అది విజయదశమిరోజు. అంతేకాదు రామరావణ యుద్ధం ముందు కూడా రాముడు పాలపిట్ట దర్శనం చేసుకున్నాడని చెబుతారు.విజయదశమి నాడు పాలపిట్టను దర్శించుకోండి..
విజయదశమి నాడు పాలపిట్టను చూస్తే విశేష ఫలితాలు లభిస్తాయని పండిట్ మనోత్పాల్ ఝా చెప్పారు. దీన్ని నీలకంఠ అని కూడా అంటారు. శివుడిని నీలకంఠుడు అని కూడా అంటారు. ఇది మంచి సంఘటనలను సూచిస్తుంది. అందుకే నీలకంఠుడిని ఎక్కడ చూసినా, ముఖ్యంగా విజయదశమి రోజున తెల్లవారుజామున దర్శనమిస్తే అదృష్టం వరిస్తుంది…నవమి ప్రసాదం స్వీకరించిన తర్వాత ఉపవాసం విరమించండి:
పండిట్ ఝా మాట్లాడుతూ 9 రోజులు ఉపవాసం ఉన్నవారు 9వ తేదీ హవన పూజ తర్వాత ఉపవాసం విరమించవచ్చు. అయితే ఎవరైతే విజయదశమి వ్రతాన్ని ఆచరిస్తారో వారు అమ్మవారిని నిమజ్జనం చేసిన తర్వాతే ఉపవాసాన్ని విరమిస్తారు. చాలా సార్లు ఉపవాసం ఉన్న వ్యక్తి అమ్మ నుండి ప్రసాదాన్ని స్వీకరించకుండా ఉపవాసం విరమిస్తాడు. కానీ అమ్మవారి ప్రసాదాన్ని స్వీకరించి వ్రతం చేస్తే విశేష ఫలితాలుంటాయని చెబుతారు…