పుణె నుంచి 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న మోర్‌గావ్‌లో కొలువుదీరిన గణపతి మోరేశ్వర్ లేదా మయూరేశ్వర్. ఈ పట్టణం ఒకప్పుడు నెమళ్ల (మయూరాలు)కు ప్రసిద్ధిచెందిందని, అందుకే మోర్‌గావ్ అనే పేరు వచ్చిందని అంటారు. అంతేకాకుండా, సాధారణంగా నెమలి కుమారస్వామి వాహనం. ఇక్కడ మాత్రం ఆయన అన్న గణపతి నెమలి వాహనుడై కొలువుదీరడం విశేషం. సింధువు అనే రాక్షసుణ్ని సంహరించడానికి గణపతి మయూరేశ్వరుడిగా అవతరించాడని కథ ప్రచారంలో ఉంది…
**చింతామణి గణపతి
ఈ ఆలయం పుణె నుంచి సుమారు 25 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఓసారి కపిల మహర్షి కోసం గణపతి గుణాసురుడితో పోరాడాల్సి వస్తుంది. భీకరమైన యుద్ధం తర్వాత చింతామణి సాయంతో అందులో వినాయకుడు గెలుస్తాడు. అందుకే చింతామణి గణపతి అనే పేరు స్థిరపడిపోయింది. ఇక్కడి స్వామిని మనస్ఫూర్తిగా ఆరాధిస్తే కోరిన కోరికలు తీరుతాయని నమ్ముతారు..
***సిద్ధివినాయకుడు
ఈ ఆలయం అహ్మద్‌నగర్ జిల్లాలోని సిద్ధటేక్‌లో ఉంది. ఎనిమిది వినాయక మందిరాల్లో ఏడింటిలో వినాయకుడి తొండం ఎడమ వైపు తిరిగి ఉండగా, ఒక్క సిద్ధటేక్‌లో మాత్రం కుడివైపు తిరిగి ఉంటుంది. పేరులో ఉన్నట్లుగానే ఇక్కడి వినాయకుడు భక్తుల కోరికలను తీర్చే కామధేనువు..
మహాగణపతి
పుణెకు 50 కిలోమీటర్ల దూరంలో రంజన్‌గావ్‌లో కొలువుదీరాడు. ఇక్కడి దేవుడిని మహాగణపతి రూపంలో కొలుస్తారు. త్రిపురాసుర సంహారానికి ముందు పరమేశ్వరుడు తనకు విఘ్నాలు కలగకుండా ఉండటానికి ఇక్కడే తన కొడుకైన గణపతిని ప్రార్థించాడని స్థల పురాణం.