కోహ్లీ రికార్డు.. ఒక్కో ఇన్​స్టా పోస్టుకు రూ.కోట్లు వసూల్..!!

Virat Kohli Instagram Income : సంపాదనలోనూ ‘కింగ్​’ కోహ్లీ రికార్డు.. ఒక్కో ఇన్​స్టా పోస్టుకు రూ.కోట్లు వసూల్

Virat Kohli Instagram Income Per Post 2023 : టీమ్​ఇండియా స్టార్ క్రికెటర్ విరాట్​ కోహ్లీ మరో ఘనత సాధించాడు. ఒక్కో ఇన్​స్టాగ్రామ్​ పోస్టుకు రూ.కోట్లలో వసూలు చేస్తూ.. అందరికంటే ముందున్నాడు. ఇన్​స్టా​ సంపాదనలో దూసుకెళ్తున్నాడు. ఇంతకీ కోహ్లీ ఎన్ని కోట్ల రూపాయలు వసూలు చేస్తున్నాడంటే?..

విరాట్ కొహ్లికి ఇన్‌స్టాగ్రామ్ లో ిఇరవై కోట్ల మందికి పైగా ఫాలోవర్స్ ఉన్నారు. ఆ పోస్టు వాళ్ల నుంచి ఇతరులకు షేర్ అవుతుంది. అది దృష్టిలో పెట్టుకుని ఒక్క పోస్టుకు ఎనిమిది నుండి 11 కోట్లు చెల్లిస్తుంది. ఇలా ఆదాయం సంపాదించే వాళ్లలో భారతీయులు మరెవరూ లేరు. కొహ్లి ఇటీవల ఫామ్ కోల్పోయి ఇబ్బంది పడుతున్నారు. వెస్టిండీస్ పర్యటనకు కూడా సెలక్టర్లు కొహ్లిని దూరంగా ఉంచారు. అయినా కొహ్లి అభిమానులు ఆయనంటే పడి చచ్చి పోతారు. కొహ్లి ఆటతీరు అందరినీ ఆకట్టుకుంటుంది. అందుకే కొహ్లికి దేశ వ్యాప్తంగానే కాకుండా ప్రపంచలోనూ అభిమానులు ఉన్నారు.