విశాఖపట్నంలోని బీచ్ లోకి అరుదైన చెక్కపెట్టె..

విశాఖపట్నంలోని బీచ్ లోకి అరుదైన చెక్కపెట్టె కొట్టు వచ్చింది. గమనించిన స్థానికులు స్థానిక పోలీసులకు సమాచాం అందించారు. తీరంలో ఉన్న చెక్కపెట్టెను పరిశీలించిన పోలీసులు పురావస్తు శాఖ అధికారులతో పెట్టెను తెరిచేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు..కాగా ఈ పెట్టె బరువు సుమారు వంద టన్నుల వరకు ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. అదేవిధంగా ఈ పెట్టె బ్రిటిష్ కాలం నాటిదని తెలుస్తోంది. ఈ క్రమంలోనే పురాతన చెక్కపెట్టెను చూసేందుకు ప్రజలు బీచ్ వద్దకు చేరుకుంటున్నారు. మరోవైపు పెట్టెలో ఏముందనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.