డబ్బు సంచులు తరలిస్తూ సాక్షాలతో సహా పట్టుబడ్డ చెన్నూరు కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వివేక్ సంస్థలకు చెందిన ఉద్యోగులు…!

మరోసారి డబ్బు సంచులు తరలిస్తూ సాక్షాలతో సహా పట్టుబడ్డ చెన్నూరు కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వివేక్ సంస్థలకు చెందిన ఉద్యోగులు.

వివేక్ ఆదేశాల మేరకు చెన్నూరు నియోజకవర్గంలోని లీడర్లను కొనుగోలు చేయడానికి 50 లక్షలు తరలిస్తూ పట్టుబడిన వివేక్ సంస్థలకు చెందిన ఇద్దరు ఉద్యోగులు.

పట్టుబడిన వారు విశాఖ ఇండస్ట్రీస్ లో పనిచేస్తున్న జూనియర్ ఎగ్జిక్యూటివ్ కంజుల రవి కిషోర్, వెలుగు పత్రిక మార్కెటింగ్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్న ముదిగంటి ప్రేమ్ కుమార్ ఉన్నారు.

పట్టుబడిన మొత్తాన్ని చెన్నూరు నియోజకవర్గానికి తరలిస్తున్నట్టు నిందితులు ఒప్పుకున్నారు. ఈ మేరకు ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగినది.

పట్టుబడిన వారి నుండి 50 లక్షల రూపాయల నగదు, రెండు మొబైల్ ఫోన్స్, ఒక మోటార్ సైకిల్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.