వివేకా హత్య కేసులో మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి సంచలన వ్యాఖ్యలు….

..
Vivekananda Reddy Murder Case Former Minister DL Ravindra Reddy..
*వివేకాను ఎవరు హత్య చేశారో పులివెందులలో అందరికీ తెలుసు*

*ఉన్నత స్థాయిలో వ్యక్తులు తప్పించుకోలేరు*

*అధికారం కోసం అడ్డదారులు తొక్కడం మంచిది కాదు..నాకు తెలిసినంత వరకు అవినాష్‍రెడ్డి తప్పించుకోలేడు,నాకు సీబీఐ మీద ప్రగాఢ నమ్మకం ఉంది*

*పాత్రధారులు, సూత్రధారులు జైల్లో ఉన్నారు.అవినాష్ రెడ్డి హత్య చేశారని తేలితే ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తామన్నారు*

*ఎర్ర గంగిరెడ్డి ఎప్పుడూ వివేకా దగ్గర ఉండేవారు. గంగిరెడ్డికి ఫోన్ చేస్తే గుండెపోటుతో చనిపోయాడన్నారు*

*ఎమ్మెల్సీ ఎన్నికల నుండి దేవిరెడ్డి శంకర్రెడ్డికి ఎర్ర గంగిరెడ్డి టచ్‍లో ఉన్నాడు*

*వివేకా పీఏ కృష్ణారెడ్డి సైతం శంకర్ రెడ్డికి టచ్‍లో ఉన్నాడు.ఇది తెలియక కృష్ణారెడ్డితో సునీత కంఫ్లైంట్ ఇప్పించారు*

*శంకర్ రెడ్డి ఏం చెబితే అది కంప్లైంట్‍లో కృష్ణారెడ్డి రాసిచ్చారు*

*సునీత, రాజశేఖర్‍ను పక్కన పెట్టుకుని చంద్రబాబు హత్య చేయించారని జగన్ సాక్షిలో నారాసుర రక్త చరిత్ర అని రాయించారు*

*సునీత, రాజశేఖర్ చంపారని సాక్షిలో రాయడం సిగ్గుచేటు*

*కోడి కత్తి అడ్డుపెట్టుకుని రాజకీయాలు వేసిన వ్యక్తి జగన్*

*జగన్‍కు డబ్బుతో పనిలేదు, ప్రజలకు సేవ చేస్తారని ఆశించాం.కానీ అధికారంలోకి వచ్చాక పరిస్థితి భిన్నంగా ఉంది*

*మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి*