చినగదిలి రూరల్ తహసీల్దార్ సనపల రమణయ్య దారుణ హత్య..

*BIG BREKING NEWS*
vizag-rural-chingadili-tehsildar-ramanaiah-of-visakha-was-killed.
విశాఖపట్నం

*చినగదిలి రూరల్ తహసీల్దార్ సనపల రమణయ్య దారుణ హత్య.

*కొమ్మది చరణ్ క్యాస్టిల్ అపార్ట్మెంట్ గెట్ ముందే గుర్తి తెలియని వ్యక్తులు తహసీల్దార్ పై రాడ్ తో దాడి

*అక్కడక్కడే కుప్పకూలిపోయిన తహసీల్దార్ రమణయ్య

*అపోల్ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ మృతి..

విశాఖలో ల్యాండ్ మాఫియా రెచ్చిపోయింది. ప్రశాంతంగా ఉండే విశాఖలో అధికారిని కొందరు దుండగులు దారుణంగా హత్య చేశారు. చిన్నగదిలి రూరల్‌ తహసీల్దార్‌ సనపల రమణయ్యను దారుణంగా హత్య చేశారు. కొమ్మాది తన నివాసంలో ఉంటున్న టైంలో దుండగులు ఎటాక్ చేశారు. చరణ్‌ క్యాస్టిల్ అపార్ట్‌మెంట్‌లో గేట్ ముందే ఆయనపై దాడి చేశారు. ఇనప రాడ్‌లతో తలపై గట్టిగా కొట్టారు. తీవ్ర గాయాలు పాలైన రమణయ్య కేకలు వేశాడు. దీంతో అక్కడే ఉన్న వాచ్ మెన్ అలర్ట్ అయ్యాడు. ఆయన పరుగెత్తుకొని వచ్చి చుట్టు పక్కల వారిని పిలవడంతో ఆ దుండగులు అక్కడి నుంచి పరార్ అయ్యారు…
తీవ్ర గాయాలై రక్తపు మడుగులో ఉన్న తహసీల్దార్‌ రమణయ్యను కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ రమణయ్య మృతి చెందారు. దీని వెనుక లాండ్ మాఫియా ఉందని కుటుంబ సభ్యలు ఆరోపిస్తున్నారు..