ఓటుకు నోటు కేసులో చంద్రబాబు నాయుడు పేరును చేర్చాలని సుప్రీంకోర్టును ఆశ్రయించిన వైఎస్సార్సీపీ మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి..!!

ఓటుకు నోటు కేసులో చంద్రబాబు నాయుడు పేరును చేర్చాలని సుప్రీంకోర్టును ఆశ్రయించిన వైఎస్సార్సీపీ మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి..

తెలంగాణ ఏసీబీ ఛార్జిషీట్‌లో 22 సార్లు చంద్రబాబు పేరు ప్రస్తావించింది.

అక్టోబరు 3న ఈ కేసును సుప్రీంకోర్టు విచారించనుంది…
అప్పటిలో తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసు.. ప్రస్తుతం చంద్రబాబు నాయుడు
ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ లో అరెస్ట్ అయిన విషయం తెలిసిందే..
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన ఓటుకు నోటు కేసు మరోసారి తెరమీదకు వచ్చింది. ఈ కేసులో మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సుప్రీం కోర్టు తలుపు తట్టారు. సోమవారం అత్యున్నత ధర్మాసనంలో ఆయన ఎర్లీ హియరింగ్ పిటిషన్ దాఖలు చేశారు. 2017లోనే ఈ పిటిషన్ దాఖలు చేసినా.. సుప్రీంకోర్టులో లిస్టింగ్ కాకపోవడంతో ఆయన మరోసారి సుప్రీం గడప తొక్కారు. 2015లో తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఓటుకు నోటు కేసు వెలుగులోకి వచ్చింది..

ఎమ్మెల్సీ ఎన్నిక కోసం టీడీపీకి మద్దతు తెలపాలంటూ.. నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌ మద్దతును రేవంత్ రెడ్డి కోరారు. ఈ సందర్భంగా రూ. 50 లక్షలు ఇవ్వజూపారన్న అభియోగంపై రేవంత్‌ను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. స్టీఫెన్‌సన్‌ను రేవంత్ రెడ్డి కలిసిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.