రేవంత్ రెడ్డికి సుప్రీం నోటీసులు…ఓటుకు నోటు కేసులో కీలక పరిణామం..!!

ఢిల్లీ

*🔹రేవంత్ రెడ్డికి సుప్రీం నోటీసులు*
*ఓటుకు నోటు కేసు విచారణను తెలంగాణ నుంచి మధ్యప్రదేశ్ కి మార్చాలని సుప్రీంకోర్టు లో పిటిషన్*

హైదరాబాద్ నుంచి కేసు విచారణ మధ్యప్రదేశ్ లోని భోపాల్ కు మార్చాలని ట్రాన్స్ఫర్ పిటిషన్ దాఖలు చేసిన *మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత జగదీష్ రెడ్డి*

పిటిషన్ పై విచారణ జరిపిన జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ సందీప్ మెహతా ధర్మాసనం.

కేసు విచారణ ను భోపాల్ కు బదిలీ చేయాలన్న వ్యవహారం పై తెలంగాణ ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డికి, ఇతర ప్రతివాదులకు నోటీసులు ఇచ్చిన జస్టిస్‌ బిఆర్‌ గవాయ్‌, జస్టిస్‌ సందీప్‌ మెహతా ధర్మాసనం.

సీఎం, హోం మంత్రి గా ఒకరే బాధ్యతలు నిర్వహిస్తున్నారని.. వెంటనే ట్రయల్ కూడా మొదలు పెట్టడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తమకు సమాచారం ఉందన్న పిటిషనర్ తరపు న్యాయవాది

ఇప్పటికిప్పుడు ట్రయల్ మొదలైతే… విచారణ పై ప్రభావం చూపే అవకాశం ఉందని ధర్మాసనం దృష్టికి తీసుకువచ్చిన పిటిషనర్ జగదీష్ రెడ్డి తరపు న్యాయవాది మోహిత్ రావు.

ఒకవేళ ట్రయల్ పై అలాంటి ప్రభావం ఉందనుకుంటే తాము ఎలా చూస్తూ ఉంటామని వ్యాఖ్యానించిన జస్టిస్ బీఆర్ గవాయ్

ఈ కేసులో ట్రయల్ ని నిలుపుదల చేస్తూ గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను కూడా ధర్మాసనం దృష్టికి తీసుకువచ్చిన పిటీషనర్

సిఎం రేవంత్‌ రెడ్డి తనపై 88 క్రిమినల్‌ కేసులు నమోదైనట్లు ధర్మాసనం దృష్టికి తీసుకువచ్చిన పిటిషనర్‌ న్యాయవాది.

అధికారం చేపట్టిన 100 రోజుల్లో గత ప్రభుత్వం చెప్పినట్లు విన్న పోలీసు అధికారులందరిని నగ్నంగా పరేడ్ చేస్తా అని గతంలో రేవంత్‌ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వివరాలు అందించిన పిటిషనర్‌

పిటిషనర్ వాదనలు పరిగణనలోకి తీసుకున్న అనంతరం రాష్ట్ర ప్రభుత్వానికి, వ్యక్తిగతంగా సీఎం రేవంత్ రెడ్డి, ఇతర ప్రతివాదులకు నోటీసులు జారీ చేసిన సర్వోన్నత న్యాయస్థానం.

నాలుగు వారాల్లో స్పందించాలని నోటీసులు ఇచ్చిన ధర్మాసనం..