పైసలిస్తేనే ఓటేస్తామంటున్న ఓటర్లు..
డబ్బులు మాకెందుకు ఇస్తలేదు అంటూ, మాకు పైసలు కావాలంటూ ప్రజా ప్రతినిధుల ఇళ్ళ ముందుకు వెళ్లి వాగ్వాదాన్ని ఎదుగుతున్న ఓటర్లు..!!
బంగారం అన్నారు ఓటికి పదివేలు అన్నారు ఎప్పుడు ఇస్తారు అంటూ నాయకుల నిలదీస్తున్న వైనం..!!
మీడియాలో వస్తున్న వార్తలను చూసి నిజమైన నమ్మిన ఓటర్లకు ప్రస్తుతం అడియాసలే మిగిలాయి..!
అధికారులు ఎంత అవేర్నెస్ తెచ్చిన ఓటర్లు మాత్రం ఓటుకు నోటు అనే తత్వంలోనే ఉన్నారు..
మునుగోడు ఉప ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. రేపు ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుండగా తమకు ఎవరు పైసలు ఇవ్వలేదని ఓట్లు వేయమని కొందరు మహిళా ఓటర్లు చెబుతున్న వీడియో వైరల్ అవుతుంది. ఓటుకు నాలుగువేల చొప్పున ఎన్ని ఓట్లు ఉంటే అన్ని నాలుగువేలు ఇచ్చారు అందరికీ ఇస్తున్నారు మాకు ఇవ్వరా ఈ గుర్తుకు ఓటెయ్యని రేపు అడిగితే వాళ్ళ సంగతి చెబుతామని మహిళలు చెబుతున్నారు..