VRAలతో చర్చలు సఫలం…

సర్కారుతో వీఆర్‌ఏల చర్చలు సఫలం.. సమ్మె విరమణ.. రేపటి నుంచే తిరిగి విధుల్లోకి..

తమ డిమాండ్ల కోసం గత కొన్ని రోజులుగా ఆందోళన చేస్తున్న VRAలకు ప్రభుత్వం తీపికబురు అందించింది. CS సోమేశ్ కుమార్ VRAల సంఘం నేతలు చర్చలు జరపగా, వారి డిమాండ్లకు ప్రభుత్వం అంగీకరించింది. దీంతో సమ్మె విరమిస్తున్నట్లు .. రేపట్నుంచి విధులకు హాజరవుతామని చెప్పారు…తమ డిమాండ్ల సాధన కోసం 80 రోజులుగా సమ్మెలో ఉన్న వీఆర్‌ఏలు దిగొచ్చారు. తెలంగాణ ప్రభుత్వంతో వీఆర్‌ఏ జేఏసీ జరిపిన చర్చలు సఫలం అయ్యాయి. వీఆర్‌ఏల డిమాండ్లకు సీఎస్‌ అంగీకరించడంతో వారు సమ్మె విరమించారు.